యంగ్ హీరో సుధీర్ బాబు ఎమర్జెన్సీ అంటూ ఓ చిన్నారి ప్రాణాలను రక్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. “ఎమర్జెన్సీ: బేబీ సంస్కృత గుండె సమస్యలను ఎదుర్కొంటోంది. ఆమె ఆపరేషన్ ప్రారంభించడానికి నేను 1 లక్షలు అందిస్తున్నాను. కాని ఆమె ఆపరేషన్ కోసం, ఇతర వైద్య ఖర్చుల కోసం 3.5 లక్షలు కావాలి. కాబట్టి నేను వ్యక్తిగతంగా నిధులు సేకరిస్తున్నాను. దయచేసి సహకరించండి” అంటూ ట్వీట్ చేశారు. హార్ట్ ప్రాబ్లమ్ తో బాధపడుతున్న ఆ చిన్నారిని కాపాడడానికి ఎవరన్నా ముందుకు వస్తారేమో చూడాలి మరి.
ప్రస్తుతం సుధీర్‌బాబు పలాస దర్శకుడు కరుణాకర్ డైరెక్షన్‌లో శ్రీదేవి సోడా సెంటర్ అనే సినిమా చేస్తున్నారు.. అలాగే అయిన మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేస్తున్నాడు. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాకి ఆ అమ్మాయి గురించి చెప్పాలని ఉంది అనే టైటిల్ ఫిక్స్ చేశారు.
EMERGENCY: Baby Samskruti is facing heart complications. I am contributing 1 Lakh for initiating the operation but her family needs 3.5 lakh more to complete the treatment & meet other medical expenses. So, I am raising funds personally. Please contributehttps://t.co/6pyRLdxbAZ
— Sudheer Babu (@isudheerbabu) May 14, 2021