తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 2792కి చేరింది. ఇవాళ కొత్తగా 94 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, మరో ఆరుగురు మృతిచెందారు. ఈ మేరకు తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. మొత్తం కరోనా కేసుల్లో 432 మంది వలస కార్మికులు, విదేశాల నుంచి వచ్చినవారు ఉన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 1491 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా, 88 మంది ప్రాణాలు కోల్పోయారు. 1,213 మంది వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. కొత్తగా నమోదైన కేసుల్లో హైదరాబాద్ పరిధిలో 79, రంగారెడ్డి 3, మేడ్చల్ 3, మెదక్ 2, నల్గొండ 2, సంగారెడ్డి 2, పెద్దపల్లి, మహబూబాబాద్, జనగాం జిల్లాల్లో ఒక్కో పాజిటివ్ కేసు నమోదయ్యాయి.