దర్శకురాలు నందినీ రెడ్డి తాజాగా కొరియన్ మూవీ మిస్ గ్రానీని తెలుగులో రీమేక్ చేయనుంది. 2014లో వచ్చిన ఈ సినిమా మంచి హిట్‌ను సాధించింది. ఈ సినిమాలో ప్రధాన పాత్రధారి 70 ఏళ్ల వృద్దురాలిగా కనిపిస్తూ ఉంటుంది. ఆమెకు ఈ సినిమాలో అతీంద్రీయ శక్తులు ఉంటాయి. ఆమెకు అవసరమైనప్పుడు యవ్వనవతిగా మారిపోతూ ఉంటుంది. అలాంటి పాత్రలో సమంతను చూపించాలనే ఉద్దేశంతోనే నందినీ రెడ్డి ఉన్నారట. కొత్తదనంతో కూడిన పాత్రలనే ఎక్కువగా చేస్తానని ఇటీవలే సమంత చెప్పింది సంగతి తెలిసిందే. ఈ సినిమా చేసే ఛాన్స్ ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే నందిని ఈ కథ కూడా సమంతకు వినిపించిందట.. ఈ సినిమాకీ సమంత ఒప్పుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.