HomeTelugu Trendingఉత్కంఠగా '7' ట్రైలర్‌

ఉత్కంఠగా ‘7’ ట్రైలర్‌

10 7రెహమాన్‌, హవీష్‌, నందిత శ్వేత, అనీషా ఆంబ్రోస్‌, రెజీనా కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘7’. నిజార్‌ షఫీ దర్శకుడు. క్రైమ్‌, థ్రిల్లర్‌ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్ర ట్రైలర్‌ గురువారం విడుదలైంది. ‘ప్రేమ, పెళ్లి పేరుతో పలువురు యువతులను మోసం చేసి పారిపోయిన కార్తీక్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు’ అన్న మాటలతో ప్రారంభమైన ట్రైలర్‌ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. కార్తీక్‌ ఒక్కడేనా, లేక ఇద్దరా? ఆ అమ్మాయిలను మోసం చేసి పారిపోయిందెవరు? అసలు ఈ సినిమాకు ‘7’ అనే టైటిల్‌ ఎందుకు పెట్టారో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్‌ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu