భారత్‌లో రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. అనుమానితులకు టెస్టులు చేస్తూ, పాజిటివ్ కేసులను హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక కరోనా పాజిటివ్ కేసులపై ఎప్పటికప్పుడు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్ ను విడుదల చేస్తున్నారు. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ దీనిపై ఓ బులిటెన్ ను రిలీజ్ చేసింది.
భారత్ లో రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో 678 కొత్త కరోనా కేసులు నమోదైనట్టు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. 33 మంది మరణించినట్టు కేంద్రం తెలియజేసింది. ఇప్పటి వరకు దేశంలో 6412 పాజిటివ్ కేసులు నమోదుకాగా, 199 మంది మరణించినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తెలియజేసింది.