ప్రముఖ నటుడు, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమాని ఒకరు విజయవాడలో ఆత్మహత్య చేసుకున్నాడు. విజయవాడ నగరంలోని తల్వాకర్స్ జిమ్‌లో ట్రైనర్‌గా పనిచేస్తున్న అనిల్‌కుమార్ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఆత్మహత్యకు ముందు ఆయన జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు లేఖ రాశాడు ‘నీ అభిమాని, నా అన్నయ్య, నా కుటుంబ సభ్యుడు పవన్ కళ్యాణ్ అన్నయ్య… నా ఆత్మకు శాంతి చేకూరాలంటే… నా చివరి కోరిక నువ్వు నన్ను చూడటానికి రావాలి… నీ చేతుల మీదుగా నా అంత్యక్రియలు చేయాలి. నిన్ను బతికి ఉండగా చూడలేకపోయాను… తప్పక చనిపోతున్నా… నువ్వు వస్తావని ఆశిస్తున్న నీ పిచ్చి అభిమాని అనిల్
అంటూ..” లేఖ రాశాడు అనిల్ కుమార్.