HomeTelugu Big Storiesఈ ఏడాది ప్రేక్షకులను షేక్ చేసిన Tollywood Controversies

ఈ ఏడాది ప్రేక్షకులను షేక్ చేసిన Tollywood Controversies

5 Tollywood controversies that shook Tollywood this year
5 Tollywood controversies that shook Tollywood this year

Tollywood Controversies in 2024:

టాలీవుడ్ పరిశ్రమ, ఒక వైపు గొప్ప చిత్రాలు, స్టార్ హీరోల ప్రతిభతో అందరి దృష్టిని ఆకర్షించగా, మరో వైపు కొన్ని పెద్ద వివాదాలతో చర్చల్లో నిలిచింది. ఈ ఏడాది టాలీవుడ్‌లో జరిగిన కొన్ని ముఖ్య సంఘటనలు పరిశ్రమలో సంచలనాలు సృష్టించాయి.

Jani Master Controversy:

సెప్టెంబర్‌లో జాని మాస్టర్‌పై వచ్చిన లైంగిక ఆరోపణలు టాలీవుడ్‌ను షాక్‌కి గురిచేశాయి. హైకోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసినా, ఈ ఘటన ఆయన ఇమేజ్ మీద మచ్చ వేసింది. రావాల్సిన నేషనల్ అవార్డు కూడా రాకుండా చేసింది.

Nagarjuna Family Controversy:

అక్కినేని నాగార్జున కుటుంబం, సమంత-చైతన్య విడాకుల అంశం రాజకీయాలకు నడుమ చిక్కుకుంది. తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలతో పరిశ్రమలో పెద్ద చర్చలు జరిగాయి. నాగార్జున ఈ వ్యవహారంపై పరువు నష్టం కేసు వేయడంతో వివాదం మరింత ముదిరింది.

Ram Gopal Varma arrest:

వివాదాలకు మారుపేరు అయిన రామ్ గోపాల్ వర్మ, ముఖ్యమంత్రులు వారి కుటుంబాలపై చేసిన అభ్యంతరకర పోస్టులతో కేసుల్లో చిక్కుకున్నారు. ఈ కేసు వర్మకు మళ్లీ న్యాయస్థానం చుట్టూ తిరగాల్సిన పరిస్థితి తెచ్చింది.

Manchu Family Issue:

మోహన్ బాబు, మంచు మనోజ్ మధ్య ఆస్తి తగాదాలు భారీ చర్చకు దారితీశాయి. జర్నలిస్టుపై మోహన్ బాబు మైక్రోఫోన్‌తో దాడి చేయడం, పోలీస్ కేసుల వరకు వెళ్లడం పరిశ్రమకు షాక్ కలిగించింది.

Allu Arjun Stampede Case:

“పుష్ప 2: ది రూల్” ప్రీమియర్ షోలో జరిగిన తొక్కిసలాటలో మహిళ మరణించడం, ఆమె కుమారుడికి గాయాలు కావడంతో అల్లు అర్జున్‌పై నమోదు అయిన కేసు ఇంకా కోర్టులో నలుగుతూనే ఉంది. బన్నీ ప్రస్తుతం బెయిల్ మీద బయట ఉన్నారు.

ALSO READ: Did a popular Kollywood director betray Naga Chaitanya?

Recent Articles English

Gallery

Recent Articles Telugu