Homeపొలిటికల్TDP నేతలకు Chandrababu Naidu స్ట్రిక్ట్ ఆదేశాలు ఏంటంటే

TDP నేతలకు Chandrababu Naidu స్ట్రిక్ట్ ఆదేశాలు ఏంటంటే

5 Strict Guidelines Issued by Chandrababu Naidu to TDP Leaders
5 Strict Guidelines Issued by Chandrababu Naidu to TDP Leaders

New Guidelines by Chandrababu Naidu to TDP Leaders:

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులకు ఐదు ముఖ్యమైన మార్గదర్శకాలను అందించారు. ఇవి పార్టీ బలోపేతానికి తోడు మంచి పాలనకు మార్గదర్శిగా నిలవాలని ఆయన స్పష్టం చేశారు. పార్టీలో ఉన్న నాయకులు, ప్రజాప్రతినిధులు ఈ సూచనలు ఖచ్చితంగా పాటించాలని ఆదేశించారు.

వైఎస్ఆర్‌సీపీకి దూరంగా ఉండాలి:

చంద్రబాబు స్పష్టంగా చెప్పిన అంశాల్లో ఇదే ప్రధానమైనది. ఇప్పటికే పార్టీ నేతలకు ఇదే విషయాన్ని తెలియజేసిన ఆయన, మరోసారి హెచ్చరించారు. వైఎస్ఆర్‌సీపీ నేతలతో ఎటువంటి సంబంధాలు కూడా పెట్టుకోకూడదని తేల్చిచెప్పారు. అయితే సంక్షేమ పథకాలను మాత్రం కక్షతత్వం లేకుండా అమలు చేస్తామన్నారు. వైఎస్ఆర్‌సీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ప్రతి నేత స్థానిక స్థాయిలో ఎదిరించాలని సూచించారు.

ప్రజలతో అనుసంధానం ఉండాలి:

ప్రజాప్రతినిధులంతా ప్రజలతో టచ్‌లో ఉండాలని చంద్రబాబు స్పష్టం చేశారు. ముఖ్యంగా మంత్రులు తమ నియోజకవర్గాలను మాత్రమే కాకుండా, అప్పగించిన జిల్లాలను కూడా పర్యటించాలని ఆదేశించారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని పరిష్కరించేందుకు ప్రయత్నించాలని సూచించారు.

గ్రూపు రాజకీయాలకు చెక్:

పార్టీలో గ్రూపు రాజకీయాలు ఏ రూపంలోనూ సాగదీయబోనని చంద్రబాబు స్పష్టం చేశారు. పార్టీలో ఏ ఒక్కరూ గ్రూప్‌లు ఏర్పరచుకోవద్దని, మంత్రులే ఈ బాధ్యతను తీసుకుని పార్టీని ఏకతాటిపై నడిపించాలన్నారు. గౌరవంగా వ్యవహరించాలని, విపక్షంలో ఉన్నప్పుడు ఎలా నడుచుకున్నారో అలాగే కొనసాగాలని చెప్పారు.

మిత్రపక్షాలతో సమన్వయం:

తెలుగుదేశం – జనసేన – బీజేపీ కూటమి మధ్య ఏకాభిప్రాయం ఉండేలా చూడాలని సూచించారు. వైఎస్ఆర్‌సీపీ ఈ కూటమిలో చీలికలు తెచ్చేందుకు ప్రయత్నిస్తుందని, అందుకు అవకాశమే లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. అన్ని కార్యకలాపాల్లో మిత్రపక్షాల నేతలకి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

పనితీరు ఆధారంగా పదవులు:

పార్టీలో నామినేటెడ్ పదవుల కేటాయింపుపై చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. పార్టీ కోసం పనిచేసినవారికే అవకాశం ఇస్తామని, మొదటి రెండు సంవత్సరాల తర్వాత మిగిలినవారికీ చాన్స్ ఉంటుందని తెలిపారు. ఇప్పటికే నియమితులైన వారి పనితీరు కూడా పరిశీలనలో ఉందని చెప్పారు. ఇక, రాష్ట్రవ్యాప్తంగా 21 ప్రముఖ దేవాలయాల ఛైర్మన్‌ పోస్టులను త్వరలో ప్రకటించనున్నట్లు తెలియజేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu