కాపులకు రిజర్వేషన్లు ఇవ్వాలని కోరినా కేంద్రంలోని బీజేపీ నేతలు ఒప్పుకోలేదని అందుకే 10 శాతం ఈడబ్ల్యూఎస్ కోటాలో 5 శాతం కాపులకు ఇచ్చామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తాను తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమైనది అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కే ఎక్కువ నిధులు ఇచ్చామన్న గడ్కరీ వ్యాఖ్యలు విడ్డూరమని అన్నారు. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, గుజరాత్ వంటి రాష్ట్రాలకు ఎన్ని నిధులు ఇచ్చారో లెక్కచూసుకోవాలని సూచించారు. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకే లక్ష కోట్లు కేటాయించారని విమర్శించారు. ఏపీకి ఇచ్చే నిధులు రోడ్లపై టోల్ పెట్టి వసూలు చేసుకునేవేనని వ్యాఖ్యానించారు. పోలవరం డీపీఆర్-2 ఆమోదంలో ఏడాది ఆలస్యమైందని దీనికి గడ్కరీ సమాధానం చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.