HomeTelugu Big Storiesతొలి సినిమా విడుదల కాకముందే మృతి చెందిన డైరెక్టర్‌

తొలి సినిమా విడుదల కాకముందే మృతి చెందిన డైరెక్టర్‌

11 12
తమిళ యువ దర్శకుడు అరుణ్ ప్రశస్త్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. కోయంబత్తూర్ సమీపంలోని మెట్టుపాల్యం దగ్గర బైక్ అదుపుతప్పి లారీని ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దర్శకుడు అరుణ్ ప్రాణాలు కోల్పోయారు. అరుణ్ డైరెక్టర్‌గా పరిచయం కాకముందు ప్రముఖ దర్శకుడు శంకర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసారు. విక్రమ్ నటించిన ‘ఐ’ సినిమాకు ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేసారు. అరుణ్ మృతిపట్ల శంకర్ దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు. నా దగ్గర పని చేసిన అసిస్టెంట్ అరుణ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం గుండెలు పగిలే బాధని కలిగిస్తుంది. ఎప్పుడు పాజిటివ్‌గా ఉంటూ తన హార్డ్ వర్క్‌తో కెరీర్‌లో ముందుకుసాగాడు. ఆయన ఆత్మకి శాంతి కలగాలని దేవుడిని ప్రార్ధిస్తున్నాను. కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని శంకర్ ట్వీట్ చేశారు.

అరుణ్ మృతితో కోలీవుడ్ మొత్తం షాక్‌కి గురైంది. ఇక అరుణ్ దర్శకుడిగా జీవీ ప్రకాష్ హీరోగా ‘4జీ’ అనే సినిమా ద్వారా పరిచయం అయ్యారు. ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. అరుణ్ మృతిపై హీరో, మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కూడా దిగ్బంతి వ్యక్తం చేసారు. ఒక సోదరుడిని , మంచి మిత్రుడిని కోల్పోయానని ఆయన దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అరుణ్ మరణ వార్త తెలిసి పలువురు ప్రముఖులు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సోషల్ మీడియా ద్వారా ప్రార్దిస్తున్నారు

Recent Articles English

Gallery

Recent Articles Telugu