HomeTelugu TrendingKalki 2898 AD: 39 ఏళ్ల తర్వాత ప్రభాస్ కల్కి కోసం ఇలా..

Kalki 2898 AD: 39 ఏళ్ల తర్వాత ప్రభాస్ కల్కి కోసం ఇలా..

kalki
39 years old Throwback picture of Kalki stars

Kalki 2898 AD Tickets: ప్రభాస్ హీరోగా నాగ అశ్విన్ దర్శకత్వంలో త్వరలో ప్రేక్షకులు ముందుకు రాబోతున్న కల్కి 2898 ఏడి సినిమా ఇప్పుడు ఇండస్ట్రీలోనే హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ టికెట్లు ఆన్లైన్ లో హాట్ కేకుల్లా అమ్ముడు అవుతున్నాయి. ఈ సినిమాకి రికార్డు స్థాయిలో ఓపెనింగ్ కలెక్షన్స్ వస్తాయి అని అనడంలో అతిశయోక్తి లేదు.

భారీ బడ్జెట్ తో అశ్వినీ దత్ నిర్మించిన ఈ సినిమా భారీ తారాగణం తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అన్ని భాషల నుంచి స్టార్ నటీనటులు ఈ సినిమాలో ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, సౌత్ సూపర్ స్టార్ కమల్ హాసన్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

అయితే కమల్ హాసన్ అమితాబ్ బచ్చన్ కలిసి నటించడం ఇది మొదటిసారి కాదు. 1985లో విడుదలైన హిందీ సినిమా గిరఫ్తార్ లో కూడా అమితాబచ్చన్, కమల్ హాసన్ లతో పాటు రజనీకాంత్ కూడా ప్రధాన పాత్రలు పోషించారు. అంటే 39 ఏళ్ల తర్వాత మళ్లీ కమల్ హాసన్ అమితాబ్ బచ్చన్ కలిసి వెండితెరపై కనిపించనున్నారు.

ఈ నేపథ్యంలో గిరఫ్తార్ సినిమా నుంచి ఈ ఇద్దరు స్టార్ నటుల ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఇన్నాళ్ల తర్వాత ఇద్దరు సూపర్ స్టార్ లని మరొకసారి వెండి తెర మీద చూడటానికి అభిమానులు కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారీ అంచనాల మధ్య జూన్ 27న ఈ సినిమా థియేటర్లలో విడుదల కాబోతోంది.

More about Kalki 2898 AD:

దీపికా పడుకొనే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో దిశా పటాని కూడా కీలక పాత్రలో కనిపించనుంది. మాళవిక నాయర్, విజయ్ దేవరకొండ, నాని, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ తదితరులు కూడా ఈ సినిమాలో కామియో పాత్రలలో కనిపించనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu