HomeTelugu Trendingఆసక్తికరంగా ‘30 రోజుల్లో ప్రేమించ‌టం ఎలా’ ట్రైలర్‌

ఆసక్తికరంగా ‘30 రోజుల్లో ప్రేమించ‌టం ఎలా’ ట్రైలర్‌

30 Rojullo Preminchadam El 1
యాంక‌ర్ ప్రదీప్ టాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇస్తున్న చిత్రం ‘30 రోజుల్లో ప్రేమించ‌టం ఎలా’. అమృతా అయ్యర్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. దర్శకుడు సుకుమార్‌ దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేసిన మున్నా ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి అనూప్‌ సంగీతం అందిస్తుండగా, ‘నీలి నీలి ఆకాశం’.. సాంగ్‌ ఎంత హిట్ అయిందో తెలిసిందే. కరోనా కారణంగా వాయిదా పడిన ఈ చిత్రం ‘30 రోజుల్లో ప్రేమించ‌టం ఎలా’ సినిమా.. ఈనెల 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.

తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో ప్రదీప్‌ ఓవైపు గ్రామీణ యువకుడిగా కనిపిస్తూనే మరోవైపు కాలేజీ కుర్రాడిగా రెండు రకాల పాత్రలు చేసినట్లు కనిపిస్తోంది. పైగా ప్రదీప్‌ లిప్‌లాక్‌ సీన్‌లో కూడా నటించినట్లు తెలుస్తోంది. హైపర్‌ ఆది, వైవా హర్ష, పోసాని కృష్ణ మురళీ వంటి కమెడియన్లు కూడా ఉండటంతో వినోదానికి ఏమాత్రం ఢోకా లేనట్లు కనిపిస్తోంది. ఆసక్తికరంగా సాగే ట్రైలర్‌ని నెటిజన్లను ఆకట్టుకుంటుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu