టాలీవుడ్లో యాంకర్ ప్రదీప్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా..?’. మున్నా డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమాలో అమృతా అయ్యర్ హీరోయిన్గా నటించింది. జనవరి 29న సినిమాను విడుదల కాబోతుంది. సినిమా రిలీజ్ దగ్గర పడుతుండడంతో ప్రొమోషన్స్ లో బిజీ అయింది చిత్రబృందం. తాజాగా ఈ సినిమా యూనిట్
మీడియా సమావేశం నిర్వహించారు. యాంకర్ ప్రదీప్ మాట్లాడుతుండగా.. ఆయన వెనుకనే ఉన్న దర్శకుడు మున్నా ఒక్కసారిగా స్టేజ్‌పై కుప్పకూలిపోయాడు. దింతో
ఒక్కసారిగా అందరు షాక్ అయ్యారు. కొద్దిసేపటి తరువాత ఆయన కోలుకొని సాధారణ స్థితికి వచ్చాడు. కాగా, దర్శకుడు సినిమాకై వర్క్ ప్రెజర్ కారణంగా ఒత్తిడికి లోనైనట్లుగా
తెలుస్తోంది.