3 పాటలు మినహా రామ్, సంతోష్ శ్రీన్‌వాస్, 14 రీల్స్ ‘హైపర్’ పూర్తి
ఎనర్జిటిక్ స్టార్ రామ్, టాలెంటెడ్ డైరెక్టర్ సంతోష్ శ్రీన్‌వాస్ కాంబినేషన్‌లో 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘హైపర్’ (ప్రతి ఇంట్లో ఒకడుంటాడు). ఈ చిత్రం వైజాగ్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. దీంతో 3 పాటలు మినహా టోటల్‌గా టాకీపార్ట్ పూర్తయింది. సెప్టెంబర్ రెండో వారంలో ఆడియో రిలీజ్ చేసి సెప్టెంబర్ 30న విజయదశమి కానుకగా ఈ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
ఎనర్జిటిక్ స్టార్ రామ్ సరసన రాశి ఖన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్, రావు రమేష్, మురళీశర్మ, పోసాని కృష్ణమురళి, ప్రభాస్ శ్రీను, తులసి, హేమ, ప్రియ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి సంగీతం: జిబ్రాన్, సినిమాటోగ్రఫీ: సమీర్‌రెడ్డి, ఆర్ట్: అవినాష్ కొల్లా, ఎడిటింగ్: గౌతంరాజు, మాటలు: అబ్బూరి రవి, లైన్ ప్రొడ్యూసర్: హరీష్ కట్టా, సమర్పణ: వెంకట్ బోయనపల్లి, నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సంతోష్ శ్రీన్‌వాస్