HomeTelugu Big Stories'రోబో 2.ఓకు గోల్డెన్‌ రీల్‌ అవార్డు

‘రోబో 2.ఓకు గోల్డెన్‌ రీల్‌ అవార్డు

11 11సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ నటించిన ‘రోబో 2.ఓ’ బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. ఇప్పుడీ చిత్రం మరో అరుదైన ఘనత కూడా సొంతం చేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చిత్రాల్లో ‘బెస్ట్‌ సౌండ్‌ ఎడిటింగ్‌’కి గానూ విదేశీ విభాగంలో 2.ఓ నామినేట్‌ అయినట్లు ఈ సినిమా సౌండ్‌ డిజైనర్‌ రసూల్‌ ట్విటర్ ద్వారా వెల్లడించారు. ‘గోల్డెన్‌ రీల్‌ అవార్డుకు ‘రోబో 2.0 ఎంపికయిందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. సౌండ్‌ డిజైనింగ్‌ విభాగంలో ఈ చిత్రానికి ఈ ఘనత దక్కింది. భారతీయ సినిమా మరింత ముందుకు వెళ్తుందని ఆశిస్తున్నాను. శంకర్‌, రజినీ, ఏఆర్‌ రెహమాన్‌లకు ధన్యవాదాలు, అభినందనలు’ అని రసూల్‌ ట్వీట్‌ చేశారు.

ప్రతి ఏడాది మాదిరిగానే ప్రఖ్యాత మోషన్ పిక్చర్‌ సౌండ్‌ ఎడిటర్స్‌(ఎంపీఎస్‌ఈ)66వ వార్షిక గోల్డెన్‌ రీల్‌ అవార్డులు కార్యక్రమాన్ని నిర్వహించనుంది. లాస్‌ ఏంజిల్స్‌ వేదికగా ఫిబ్రవరి 17న ఈ వేడుకలు జరుగుతాయి. 2.ఓ తో పాటు మరెన్నో అంతర్జాతీయ చిత్రాలు ఈ అవార్డులకు ఎంపికయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా సౌండ్‌ ఎడిటింగ్‌ విభాగంలో అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రాలను ఈ అవార్డులకు ఎంపిక చేస్తారు.రజినీ కాంత్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘రోబో 2.ఓ’ చిత్రానికి శంకర్‌ దర్శకత్వం వహించారు. అక్షయ్‌కుమార్‌ విలన్‌ పాత్రలో కనిపించారు. ఈ సినిమాలో అమీ జాక్సన్‌ హీరోయిన్‌. ఈచిత్రానికి ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందించారు. నవంబర్‌ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈచిత్రం రూ.700కోట్లు రాబట్టిందని అంచనా.

Recent Articles English

Gallery

Recent Articles Telugu