ఢిల్లీలోని ఒకే కుటుంబంలో 26 మందికి కరోనా పాజిటివ్ రావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఇప్పటికే ముంబై తర్వాత ఢిల్లీలో ఎక్కువ కరోనా కేసులు నమోదవుతున్నాయి. కంటైన్‌మెంట్ జోన్లలోని ప్రజలను బయటకు రానివ్వకుండా కఠినంగా నిబంధనలు అమలు చేస్తున్నారు. కంటైన్‌మెంట్ జోన్లలో వారి ఇళ్లకే నిత్యావసరాలను సరఫరా చేస్తున్నారు. ఢిల్లీలో ఇప్పటి వరకు 71 కంటైన్‌మెంట్ జోన్లను గుర్తించారు. దేశవ్యాప్తంగా 14 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలోని జహంగీర్‌పుర ప్రాతంలోని ఒకే కుటుంబంలో 26 మందికి కరోనా సోకినట్లు సీఎం కేజ్రీవాల్ వెల్లడించారు. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నందున మరిన్ని కఠిన చర్యలు తీసుకోక తప్పదని అన్నారు.