Homeతెలుగు News250వ రోజుకు చేరుకున్న జగన్"ప్రజాసంకల్పయాత్ర"

250వ రోజుకు చేరుకున్న జగన్”ప్రజాసంకల్పయాత్ర”

వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన సుదీర్ఘ పాదయాత్ర “ప్రజాసంకల్పయాత్ర” 250వ రోజుకు చేరుకుంది. గతేడాది నవంబర్‌ 6న కడప జిల్లా ఇడుపులపాయలో ప్రజాసంకల్పయాత్ర ప్రారంభమైంది. ఇప్పటివరకు 10 జిల్లాల్లో దిగ్విజయంగా పూర్తైన పాదయాత్ర ప్రస్తుతం 11వ జిల్లాలో కొనసాగుతోంది. బుధవారం సాయంత్రానికి జగన్ 2,842కి.మీ పాదయాత్ర పూర్తి చేశారు. విశాఖపట్నం జిల్లా అనకాపల్లి నియోజకవర్గంలో ప్రజాసంకల్పయాత్ర సాగుతోంది. అలుపెరగకుండా నిర్విరామంగా 9 నెలలకుపైగా నడుస్తున్న వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రతిచోటా ప్రజా సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ప్రజల నుంచి వినతులను స్వీకరిస్తున్నారు.

6 29

ఇక ఇవాళ విశాఖ జిల్లా అనకాపల్లి నియోజకర్గం, తుమ్మలపాల శివారు నుంచి ప్రారంభమైన పాదయాత్ర మార్టూరు క్రాస్‌, బవులవాడ, త్రిమూర్తులునగర్‌ మీదగా దర్జీనగర్‌ వరకు సాగింది. మహిళలు, దివ్యాంగులు, విద్యార్థినీ, విద్యార్థులు, ముస్లింలు సైతం జగన్ పాదయాత్రకు తరలి వస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu