Tollywood Sequels in 2024:
టాలీవుడ్‌లో సీక్వెల్స్ ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు సీక్వెల్స్ అంటే పెద్దగా ఆలోచించేవారు కాదు, ప్రేక్షకులు కూడా వాటిని సీరియస్‌గా తీసుకోలేదు. కానీ ఇప్పుడా పరిస్థితి పూర్తిగా మారింది. సీక్వెల్స్ ఇప్పుడు పెద్ద బడ్జెట్ సినిమాలకే కాదు, ప్రేక్షకుల అంచనాలకు కూడా చాలా కీలకంగా మారాయి. 2024 సంవత్సరంలో ఈ ట్రెండ్ బాగా స్పష్టమైంది. ఈ ఏడాది పుష్ప-2, మత్తు వదలారా-2 వంటి సీక్వెల్స్ హిట్ అవగా, కొన్ని మాత్రం అంతగా మెప్పించలేకపోయాయి.
పుష్ప-2 గురించి చెప్పుకోవాలి. ఈ సినిమా ఒకరోజులోనే ప్రపంచవ్యాప్తంగా 294 కోట్ల రూపాయల వసూళ్లు చేసి సంచలనం సృష్టించింది. పుష్ప-2 విజయం టాలీవుడ్‌లో సీక్వెల్స్ కోసం ఎంత క్రేజ్ పెరిగిందో నిరూపించింది.
View this post on Instagram
టిల్లూ స్క్వేర్ కూడా సక్సెస్ సాధించిన మరో సీక్వెల్. డీజే టిల్లుతో పోల్చితే, ఈ సినిమా మరింత అత్యధిక వసూళ్లు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా ₹100 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది.
View this post on Instagram
ఇదే సమయంలో, డబుల్ ఐస్మార్ట్, యాత్ర-2 వంటి సీక్వెల్స్ మాత్రం అంచనాలను అందుకోలేకపోయాయి. మత్తు వదలారా-2 మాత్రం ఓ పెద్ద సర్ప్రైజ్. క్రైమ్-కామెడీ జానర్‌లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. బడ్జెట్ తక్కువగా ఉండి కూడా మంచి కలెక్షన్లు రాబట్టింది.
View this post on Instagram
2024లో సీక్వెల్స్ గురించి చూస్తే పుష్ప-2, మత్తు వదలారా-2, టిల్లూ స్క్వేర్ వంటి సినిమాలు హిట్ అవగా, డబుల్ ఐస్మార్ట్, యాత్ర-2 మాత్రమే ఫ్లాప్ అయ్యాయి. ఏదేమైనా 2024 టాలివుడ్ సీక్వెల్స్ కి బాగానే వర్క్ అవుట్ అయ్యింది. హిట్ సీక్వెల్స్ కారణంగా టాలివుడ్ రికార్డులు తారుమారు అయ్యాయి. టాలీవుడ్‌లో వచ్చే రోజులలో దేవర-2, కల్కి-2, పుష్ప-3 వంటి సీక్వెల్స్‌పై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలు ప్రేక్షకుల అంచనాలను ఎంతవరకు అందుకుంటాయో చూడాలి.
ALSO READ: Bigg Boss 8 Telugu విన్నర్ అతనేనా?