సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) ఏడో ఎడిషన్ కార్యక్రమం దుబాయ్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినీ పరిశ్రమలకు చెందిన తారాలోకం సైమాలో సందడి చేసింది. ఈ సందర్భంగా సైమా అవార్డులు అందుకున్న తెలుగు సెలబ్రిటీల జాబితాను సైమా ట్విటర్ ద్వారా ప్రకటించింది.
ఉత్తమ నటుడు: ప్రభాస్ (బాహుబలి), ఉత్తమ నటుడు (క్రిటిక్): నందమూరి బాలకృష్ణ, ఉత్తమ నటి: కాజల్ అగర్వాల్ (నేనే రాజు నేనే మంత్రి), ఉత్తమ నిర్మాత: రాజీవ్ రెడ్డి (గౌతమిపుత్ర శాతకర్ణి), ఉత్తమ దర్శకుడు: ఎస్ ఎస్ రాజమౌళి (బాహుబలి), ఉత్తమ చిత్రం: బాహుబలి, ఉత్తమ నటుడు (నెగిటివ్ రోల్): రానా దగ్గుబాటి (బాహుబలి), ఉత్తమ హాస్యనటుడు: రాహుల్ రామకృష్ణ, ఉత్తమ పరిచయ నటుడు: ఇషాన్, ఉత్తమ పరిచయ నటి: కల్యాణి ప్రియదర్శన్ (హలో), ఉత్తమ పరిచయ దర్శకుడు: సందీప్ రెడ్డి వంగా (అర్జున్ రెడ్డి), ఉత్తమ సహాయ నటుడు: ఆది పినిశెట్టి, ఉత్తమ సహాయ నటి: భూమిక, ఉత్తమ సంగీత దర్శకుడు: ఎంఎం కీరవాణి, ఉత్తమ గాయకుడు: కాల భైరవ, ఉత్తమ గాయని: మధు ప్రియ, ఉత్తమ పాటల రచయిత: సుద్దాల అశోక్ తేజ, ఉత్తమ సినిమాటోగ్రాఫర్: సెంథిల్ కుమార్, ఐకాన్ ఆఫ్ ది ఇయర్ (ఫీమేల్): హన్సిక, ఐకాన్ ఆఫ్ ది ఇయర్ (మేల్): మాధవన్ లు ఎంపికైయ్యారు.