HomeTelugu Big Stories200 పైగా భారతీయ గాయకులు 14 భాషల్లో 'కరోనా' పై పాట..

200 పైగా భారతీయ గాయకులు 14 భాషల్లో ‘కరోనా’ పై పాట..

7 16
భారత్‌లో కరోనా వైరస్‌ రోజురోజుకు మరింత విజృంభిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఒకే కుటుంబంగా కలిసి నిలబడిన ప్రతీ భారతీయుడిని సినీ గాయకులు ఉత్తేజపరిచే విధంగా సెల్యూట్‌ చేస్తూ ఓ పాట పాడారు. దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన 214 మంది సినీ గాయకులు ‘జయతు జయతు భారతం.. వాసుదేవ్ కుతుంబక్కం’ అంటూ ఆలపించారు. 6 నిమిషాల నిడివి ఉన్న ఈ పాటలో ప్రముఖ గాయకులు.. ఆశా భోంస్లే, సోనూ నిగమ్‌, ఎస్పీ బాలసుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు. ఈ పాటను ఇండియన్‌ సింగర్స్‌ రైట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు శంకర్‌ మహదేవన్‌, ప్రసూన్‌ జోషిలు కలిసి రచించారు. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతుంది. ప్రముఖ గాయని ఆశా భోంస్లే మాట్లాడుతూ.. ‘ ‘జయతు జయతు భారతం’ ఈ కష్ట సమయాల్లో కుటుంబంగా కలిసి నిలబడిన ప్రతి భారతీయుడికి నమస్కారంగా 14 భాషల్లోని చారిత్రాత్మక గీతం అంకితం చేయబడింది. ఇప్పుడు అన్ని సవాళ్లకు మించి కొత్త ‘జగా హువా భారత్’ లో భాగం కావాల్సిన సమయం ఆసన్నమైంది. మానవాళికి అతిపెద్ద సంక్షోభాలలో ఒకటి గెలిచింది’ అని పేర్కొన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu