భాతరదేశంపై యుద్ధం చేయడానికి పాకిస్తాన్ ఉవ్విళ్లూరుతున్నది. ఇప్పటికే ఇండియా పాక్ ల మధ్య మూడు యుద్దాలు జరిగాయి. ఈ మూడు యుద్ధాల్లో పాక్ ఓడిపోయింది. అందుకే పాకిస్తాన్ ఓ అడుగు ముందుకేసి.. ఇండియాతో అణుయుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నామని, తమ దగ్గర పావుకిలో అణుబాంబులు ఉన్నాయని చెప్పింది. పాక్ రైల్వేశాఖ మంత్రి చేసిన అక్టోబర్ యుద్ధం ప్రకటనతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
కాగా, పాకిస్తాన్ రహస్యంగా అణ్వాయుధాలను తయారు చేస్తున్న సంగతి తెలిసిందే. సొంతంగా అణ్వాయుధాలను తయారు చేస్తున్నట్టు ఇప్పటి వరకు పాక్ చెప్తూ వచ్చింది. తమకు ఎవరి సహాయ సహకారాలు అవసరం లేదని చెప్తూ వచ్చింది. అయితే, పాక్ కు చైనా ఇంజనీర్లు సహాయం చేస్తున్నట్టు ఓ దోమ బట్టబయలు చేసింది. కరాచీలోని హాకిస్ బేలో ఉన్న అణుశక్తి కర్మాగారంలో చైనాకు చెందిన 200 మంది ఇంజనీర్లు పనిచేస్తున్నారు. వీరు గత కొన్ని రోజులుగా డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నారని పాక్ పత్రిక తెలియజేసింది. చైనా ఇంజనీర్లకు మెరుగైన వైద్యం అందిస్తున్నట్టు పాక్ ఆరోగ్యశాఖా మంత్రి అజ్రా ఫైజల్ తెలిపారు. వీరంతా అణుశక్తి కర్మాగారంలో ఏ విషయంపై పనిచేస్తున్నారో ఇప్పటికే అర్ధం అయ్యింది. చైనా సహాయంతో పాక్ అణుబాంబులను తయారు చేసుకుంటోందని స్పష్టం అయ్యింది.