తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, సంచలన దర్శకుడు ఎస్. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం 2.ఓ (2.O). ఈ చిత్రం ఆడియోను మాత్రమే ఇప్పటివరకు విడుదల చేశారు. ఈ చిత్రంలో బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ విలన్‌గా నటించారు. దీంతో ఈ టీజర్ కోసం కోట్లాది మంది అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. రజనీతో పాటు యాక్షన్ స్టార్ అక్షయ్ కుమార్ నటిస్తున్న చిత్రానికి సంబంధించిన కొన్ని సీన్లతో, డైలాగులతో కూడిన వీడియో తాజాగా లీక్ అయింది. ఇదే టీజర్ లీక్ అంటూ సినిమాలో కొన్ని దృశ్యాలు ఆదివారం ఉదయం విడుదల కావడం చిత్ర యూనిట్‌కు షాకిచ్చింది.
