గత వారం అంతా ఎక్కడ చూసినా 2.0 సందడే కనిపించింది.రజిని కాంత్,శంకర్ ల కాంబినేషన్ లో హాట్ ట్రిక్ సినిమా కావడం,బ్లాక్ బస్టర్ మూవీ రోబో కి సీక్వెల్ కావడం అలాగే బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఇందులో విలన్ గా కనిపించడంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అలాగే ఈ సినిమా బడ్జెట్ 450 కోట్లు కావడంతో శంకర్ లాంటి ఎఫిషియంట్ డైరెక్టర్ కచ్చితంగా ఎదో కొత్త లోకాన్ని సృష్టించి ఉంటాడని అంతా అనుకుంటున్నారు. అయితే ఈ సినిమా బడ్జెట్ కి తగ్గట్టే ఈ సినిమాకి సంబంధించిన ప్రతి ఈవెంట్ కూడా ఇంటర్నేషనల్ మార్కెట్ మాట్లాడుకునేలా అతిభారీగా చేస్తున్నారు.
ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేసి,ఫస్ట్ లుక్ రిలీజ్ కోసం ముంబై లో ఏర్పాటు చేసిన ప్రోగ్రాం కి ఏకంగా 6 కోట్లు ఖర్చు చేసారు. ఇండియా మొత్తం విపరీతమయిన కవరేజ్ రావడంతో పాటు ఫారెన్ జర్నలిస్టులను కూడా సకల సదుపాయాలతో తీసుకువచ్చి ఆ ఈవెంట్ కవర్ చేయించడం వల్ల ఆ రేంజ్ ఖర్చయింది. రెండు పాటలతో ఉన్న ఈ సినిమా ఆడియో రిలీజ్ ఈవెంట్ ని ప్రపంచమంతా మాట్లాడుకునేలా దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా లో నిర్వహించారు. ఈ ఈవెంట్ కోసం నిర్మాతలు అక్షరాలా 12 కోట్లు ఖర్చు చేసారు. ఇక్కడినుండి చార్టర్డ్ ఫ్లైట్స్ లో గెస్ట్ లను దుబాయ్ కి తీసుకెళ్లారు.
అంటే రెండు ఈవెంట్స్ కి కలిపి 18 కోట్లు ఖర్చు చేసారు. అంటే తెలుగులో ఆల్మోస్ట్ రెండు మీడియం బడ్జెట్ సినిమాలు చేసేయ్యొచ్చు. బడ్జెట్ దగ్గరి నుండి ప్రతి విషయంలో బాహుబలితో పోటీ పడుతున్నాడు శంకర్. కానీ బాహుబలి టీమ్ ఎక్కడిక్కడ టై అప్స్ పెట్టుకుని తక్కువ ఖర్చుతో ఎక్కువ హైప్ తెచ్చుకుంది. 2.0 నిర్మాతలు మాత్రం ఆ విషయంలో కూడా బాహుబలిని దాటేశామని హ్యాపీ గా ఉన్నారు.