Homeతెలుగు వెర్షన్మహేష్, వంశీతో సినిమా చేస్తాడా..?

మహేష్, వంశీతో సినిమా చేస్తాడా..?

 

మహేష్, వంశీతో సినిమా చేస్తాడా..? 
మహేష్ రీసెంట్ గా పివిపి బ్యానర్ లో ‘బ్రహ్మోత్సవం’ అనే సినిమాలో నటించారు. భారీ పెట్టుబడితో రూపొందించిన సినిమా నిరాశనే మిగిల్చింది. కనీస వసూళ్లు కూడా రాబట్టలేకపోయింది. దీంతో అదే బ్యానర్ లో మరొక సినిమా చేసి నష్టాల్ని పూడ్చాలని మహేష్ భావించాడని, అందుకే మరో సినిమా చేయడానికి ఒప్పుకున్నాడని ఇలా రకరకాల వార్తలు వినిపించాయి. అయితే సెప్టెంబర్ 9 న మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ప్రముఖ నిర్మాణ సంస్థ పివిపి వారు మహేష్ తో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేస్తున్నామని అనౌన్స్ చేశారు. అంతేకాదు పోస్టర్స్ డిజైన్ చేయించి అన్ని మీడియా సంస్థలకు యాడ్స్ కూడా ఇచ్చేసారు. దీంతో ఈ కాంబినేషన్ సెట్ అయిందనే అందరూ భావించారు. ఈ సినిమా షూటింగ్ కోసం మహేష్ త్వరలోనే అమెరికా వెళ్లనున్నాడని కూడా చెప్పారు. అయితే ఇదంతా మహేష్ కు తెలియకుండానే జరిగినట్లు సమాచారం. నిజానికి ఈ సినిమా కోసం మహేష్ ఎటువంటి అగ్రిమెంట్ చేయలేదట. నిజానికి ‘బ్రహ్మోత్సవం’ సినిమా సమయంలో మహేష్ భార్య నమ్రతకు, పివిపి వారికి అభిప్రాయబేధాలు ఏర్పడ్డాయి. ఇక ఈ బ్యానర్ లో సినిమా చేయకూడదని నమ్రత అప్పుడే డిసైడ్ అయిందట. సో.. మహేష్ ఈ సినిమాలో నటించే అవకాశాలు లేవనే చెప్పాలి!

Recent Articles English

Gallery

Recent Articles Telugu