కరోనా వైరస్ కేసులు రోజు రోజుకు పెరిగిపోతుండటంతో దేశంలోని అన్ని రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి. తగిన చర్యలు తీసుకుంటున్నాయి. అయితే, మార్చి నెల కావడంతో పదోతరగతి పరీక్షలు యధాతదంగానే నిర్వహిస్తామని ఇప్పటికే కేసీఆర్ సర్కార్ పేర్కొన్నది.
ఇదిలా ఉంటె, పదోతరగతి పరీక్షలపై హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. పదో తరగతి పరీక్షలను వాయిదా వేయాలని ఆదేశాలు జారీ చేసింది. రేపు జరిగే పరీక్షలు యధావిధిగా జరుగుతాయని, మార్చి 23 నుంచి జరిగే పరీక్షలను వాయిదా వేయాలని ఆదేశించింది. పరీక్షలను రీ షెడ్యూల్ చేయాలని ఆదేశించింది. ఈనెల 30 నుంచి ఏప్రిల్ 6 వరకు జరగాల్సిన పరీక్షల విషయంలో పరిస్థితులను బట్టి తదుపరి నిర్ణయం తీసుకోవాలని సూచించింది.