HomeTelugu Reviews100 Days of Love Movie Review

100 Days of Love Movie Review

“100 డేస్ ఆఫ్ లవ్” రివ్యూ!
 
నటీనటులు: 
దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్, వినీత్, ప్రవీణ తదితరులు.. 
 
సాంకేతికవర్గం: 
సంగీతం: గోవింద్ మేనేన్ 
నేపధ్య సంగీతం: బిజిబల్ 
కెమెరా: ప్రతీష్ వర్మ
మాటలు: శశాంక్ వెన్నెలకంటి 
పాటలు: కృష్ణ చైతన్య 
నిర్మాతలు: వెంకటరత్నం 
దర్శకత్వం: జెనుసే మహమ్మద్  
విడుదల తేదీ: 26/8/2016 
రేటింగ్: 3/5 
 
“ఓకే బంగారం” చిత్రంతో అశేష ప్రేక్షకలోకాన్ని తమ ప్రేమ పరవశంలో ముంచెత్తిన దుల్కర్-నిత్య మరోమారు కలిసి నటించిన మలయాళ చిత్రం “100 డేస్ ఆఫ్ లవ్”. 2015లో మలయాళంలో విడుదలైన ఈ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో అనువదించారు. తాను నటించిన స్టార్ హీరో సినిమాల ప్రమోషన్స్ కి కూడా రాని నిత్యామీనన్.. “100 డేస్ ఆఫ్ లవ్”ని స్వయంగా ప్రమోట్ చేయడంతో ఇండస్ట్రీలోనే కాక ప్రేక్షకుల్లోనూ మంచి బజ్ క్రియేట్ అయ్యింది. మరి క్యూట్ లవ్ స్టోరీ ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుందో చూద్దాం..!!
100-Days-of-Love-Release-Date-Poster
 
కథ: 
ఒక వర్షం కురిసిన రాత్రి సావిత్రి (నిత్యామీనన్) అనే అమ్మాయిని యాధృకంగా కలిసిన గోపాల్ అలియాస్ రావుగోపాల్ రావు (దుల్కర్) ఆమెతో వంద రోజులపాటు సాగించిన ప్రణయగాధే “100 డేస్ ఆఫ్ లవ్”.
వీరి ప్రేమాయణం చివరికి ఏ తీరానికి చేరింది? అనేది సినిమా కథాంశం. 
 
నటీనటుల పనితీరు: 
“ఓకే బంగారం”తో సూపర్ సక్సెస్ పెయిర్ అనిపించుకొన్న దుల్కర్-నిత్య మరోమారు అదే స్థాయి కెమిస్ట్రీతో అలరించారు. జీవితంలో ఏదైనా సాధించాలనుకొనే వ్యక్తిగా దుల్కర్ అద్భుతంగా నటించాడు. అలాగే.. అతడికి పెయిర్ గా హైట్ తప్ప అన్ని రకాలుగానూ నిత్య ఒదిగిపోయింది. 
“ప్రేమదేశం” ఫేమ్ వినీత్ ను ఈ చిత్రంలో నిత్యామీనెన్ తండ్రిగా సరికొత్తగా చూడడం ప్రేక్షకుడికి సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది. అలాగే హీరో ఫ్రెండ్ గా గుమ్మడి పాత్రలో శేఖర్ మీనన్ తనదైన కామెడీ టైమింగ్ తో ఉల్లాసపరిచాడు. 
మిగతా నటీనటులందరూ తమకు లభించిన పాత్రలకు పూర్తి స్థాయిలో న్యాయం చేశారు. 
 
ప్లస్ పాయింట్స్:
దుల్కర్-నిత్య కెమిస్ట్రీ 
ప్రతీష్ కెమెరా వర్క్ 
బ్యాగ్రౌండ్ స్కోర్ 
100-days-of-Love-Telugu-Movie-Release-date-Posters-3
 
మైనస్ పాయింట్స్:
సాగినట్లుగా అనిపించే కథనం 
కొత్తదనం లేని కథ 
ఫస్టాఫ్ లో హీరోయిన్ కోసం సెర్చ్ చేసే సీన్స్
 
సాంకేతికవర్గం పనితీరు: 
గోవింద్ మేనన్ అందించిన బాణీలకంటే.. బిజిబల్ సమకూర్చిన నేపధ్య సంగీతానికే ఎక్కువ మార్కులు పడ్డాయి. ప్రతి సన్నివేశంలోని ఎమోషన్ ను తన నేపధ్య సంగీతంతో ప్రేక్షకులు ఓన్ చేసుకొనేలా చేశాడు బిజిబల్. 
ప్రతీష్ శర్మ కెమెరా వర్క్ ఈ సినిమాకి మరో హైలైట్. ముఖ్యంగా రోమాంటిక్ సీన్స్ కు వాడిన గ్రే టింట్ అండ్ నైట్ ఎఫెక్ట్ కోసం వాడిన యెల్లో మిక్స్డ్ టింట్ సన్నివేశంలోని ఎమోషన్ ను ఎలివేట్ చేయడంలో కీలకపాత్ర పోషించాయి. 
స్వచ్చమైన సంగీతానికి కృష్ణచైతన్య అందించిన హృద్యమైన సాహిత్యం తొడవ్వడంతో.. ప్రతి పాట వినసోంపుగా ఉంటుంది. 
శశాంక్ వెన్నెలకంటి సంభాషణలు బాగున్నప్పటికీ.. డబ్బింగ్ సమయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం వలన చాలా చోట్ల లిప్ సింక్ ఉండదు. అందువల్ల కాస్త ఇబ్బందిపడాల్సి వస్తుంది.
 
జెనుసే మహమ్మద్ రాసుకొన్న కథ చాలా పాతది. అయితే.. ఆ కథను నడిపించిన కథనమే ఈ చిత్రానికి ఆయువుపట్టుగా నిలిచింది. ప్రతి ఫ్రేమ్ లోనూ ఫ్రెష్ నెస్ కనిపిస్తుంది. ముఖ్యంగా.. బాత్ రూమ్ లో దుల్కర్-నిత్యల నడుమ సాగే సన్నివేశం ఆద్యంతం ఆకట్టుకుంటుంది. అలాగే.. ఇద్దరి మధ్య కెమిస్ట్రీని కూడా అద్భుతంగా పండించారు. కథకుడిగా కాస్త తడబడినా దర్శకుడిగా మాత్రం వందకి వంద మార్కులు సంపాదించుకొన్నాడు మహమ్మద్. 
 
మొత్తానికి.. 
మితిమీరిన ద్వంద్వార్ధ సంభాషణలు, హద్దుమీరిన వెగటు పుట్టించే శృంగార సన్నివేశాలు లేకుండా.. మనసుకి ఉల్లాశాన్ని, కంటికి ఆనందాన్ని సమపాళ్లలో అందించే చిత్రం “100 డేస్ ఆఫ్ లవ్”. కాస్త సాగినప్పటికీ.. ఓవరాల్ గా ఒకే అనిపించే చిత్రమిది!
100days-of-love-1
 

 

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu