HomeTelugu Big Storiesయూట్యూబ్ లో విజయ్ రికార్డ్!

యూట్యూబ్ లో విజయ్ రికార్డ్!

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న 61వ ప్రతిష్టాత్మక చిత్రం అదిరింది. ఈ చిత్రం టీజర్ కు అద్భుతమైన స్పందన లభిస్తోంది. 1.5 మిలియన్ వ్యూస్ తో తెలుగు స్టార్ హీరోల చిత్రాలకు ధీటుగా వ్యూస్ రావడంతో ఆయన తెలుగు అభిమానులు ఫుల్ ఖుషీ గా వున్నారు. ఈ సినిమాతో తెలుగు లో విజయ్ తన సత్తా చూపించబోతున్నాడు. దాదాపు 100 కోట్లతో నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగు తమిళ భాషల్లో గ్రాండ్ గా రిలీస్ చేయనున్నారు.
ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ను మురళీ రామస్వామి, హేమా రుక్మిణి, తెన్నాండల్ స్టూడియోస్ ప్రై.లిమిటెడ్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తెన్నాండల్ బ్యానర్లో నిర్మిస్తున్న వందో చిత్రం కావడం విశేషం. స్టార్ డైరెక్టర్ అట్లీ ఈ చిత్రానికి దర్శకుడు. ఆస్కార్ విన్నర్ ఎ.ఆర్.రెహమాన్ స్వరాలందిస్తున్నారు. తెన్నాండల్ స్టూడియోస్, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి తెలుగులో అదిరింది చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. 

Recent Articles English

Gallery

Recent Articles Telugu