ప్రముఖ నటి సోనాలి బింద్రే క్యాన్సర్ తో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె అమెరికాలో ఓ హాస్పిటల్ లో క్యాన్సర్ కు చికిత్స పొందుతున్నారు. క్యాన్సర్ విషయం తెలిసిన దగ్గరి నుంచి ప్రతి క్షణం ఆనందంగా ఉండేందుకు సోనాలి ప్రయత్నిస్తోంది. హాస్పిటల్ లో చేరిన దగ్గరి నుంచి తన జుట్టు కత్తిరించుకుంటూ.. వస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా పూర్తిగా జుట్టు కత్తిరించుకొని గుండుతో ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
‘ఆ ఫొటోలో ఉన్నది నేనే. నేను చాలా ఆనందంగా ఉన్నాను. ప్రతి క్షణం ఆనందంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాను. నేను ఒంటరిగా ఉన్నానన్న భావన కలగడంలేదు. చుట్టూ నా స్నేహితులు ఉన్నారు. వారు ఎంతో బిజీగా ఉన్నప్పటికీ నాకోసం సమయం కేటాయిస్తూ నన్ను చూడటానికి వచ్చారు. నాకు జుట్టులేదన్న భాధ ఇప్పుడు లేదు. రెడీ అవ్వడానికి నాకిప్పుడు ఎక్కువ సమయం పట్టదు’ అని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.