టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా పోలీస్ బాసులకు కలిశారు. ఫ్యామిలీ మ్యాన్‌గా పేరు తెచ్చుకున్న మహేష్ చేసే మంచి పనుల్లో కూడా పెద్దగా పబ్లిసిటీని ఆశించరు. విజయవాడ ఆంధ్ర హాస్పిటల్ ద్వారా ఎందరో చిన్నారులకు హార్ట్ ఆపరేషన్లు చేయించి ప్రాణదానం చేశారు. గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ది పథంలో వాటిని నడిపించేందుకు కృషి చేస్తున్నారు. రాష్ట్ర రాజకీయాలకే కాకుండా.. సినీ రాజకీయాలకు కూడా ఆయన దూరంగా ఉంటారు.
అయితే ఆయన మరో మంచి పని కోసం పోలీస్ బాసులను కలిశారు. ఇటీవల ‘హరితహారం’ ప్రోగ్రాం ఊపందుకున్న విషయం తెలిసిందే. ఒక్కొక్కరూ మొక్కలను నాటడమే కాకుండా మరో ముగ్గురికి ఆ ఛాలెంజ్‌ని విసిరి గ్రీనరీ కోసం పాటుపడుతున్నారు. ఈ ప్రోగ్రాం క్యాంపెయిన్‌లో మహేష్ పాల్గొన్నారు. దీనికోసం పోలీస్ బాసులను కలిసి కాసేపు వారితో ముచ్చటించారు. పోలీసు బాసులు ఆయనకు ఒక మొక్కను బహుమతిగా ఇచ్చారు.