భారతీయులంతా ఫిట్‌గా ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర క్రీడా శాఖ మంత్రి రాజ్యసింగ్ రాథోడ్ విసిరిన “హమ్ ఫిట్‌తో ఇండియా ఫిట్” అనే ఫట్‌నెస్ సవాల్ సోషల్ మీడియాలో ప్రారంభించిన సంగతి తెలిసిందే. రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ విసిరిన ఈ ఫిట్‌నెస్ ఛాలెంజకు సోషల్ మీడియాల్ అద్భతమైన రెస్పాన్స్ వస్తుంది. రాజ్యవర్దన్‌తో మొదలై విరాట్, అనుష్క శర్మ, పీవీ సింధు, సైనాలు సహా ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ చాలెంజ్‌ను స్వీకరించిన వారిలో ఉన్నారు.
ఈ సవాల్ స్వీకరించన అఖిల్ తాను జిమ్ వర్కవుట్ చేస్తున్న వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, దుల్కర్ సల్మాన్, వరుణ్ ధావన్‌లకి ఈ సవాల్ విసిరాడు. వీరిలో చైతూ ముందుగా స్పందించి తన ఫిట్ నెస్ వీడియో షేర్ చేస్తూ ఈ ఛాలెంజ్ లో సమంత, నిధి అగర్వాల్, సుశాంత్ లు పాల్గొనమని కోరాడు. దీనికి స్పందించిన సమంత తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లె చాలెంజ్ స్వీకరిస్తున్నానని చెబుతూ “పుల్ అప్” చేస్తున్న వీడియోను పోస్ట్ చేసింది. ఈ చాటెంజ్‌ను ఉపాసన కామినేనికొనిదెల, శిల్పారెడ్డి, రకుల్ ప్రీత్‌సింగ్‌కి విసురుతున్నాను అంటూ సమంత తన పోస్ట్‌లో పేర్కొంది.
అయితే ప్రస్తుతం టాలీవుడ్ హీరోయిన్లు లావణ్య త్రిపాఠీ, నేహ శర్మ కూడా ఈ చాలెంజ్‌ను స్వీకరించి తమ ట్విటర్‌లో పోస్ట్ చేశారు. బాబాయ్ ఈసారి ఇంకొంచెం వేయిట్ అంటూ ఓ వీడియోను పోస్ట్ చేసి నెటిజన్లని ఆకట్టుకుంటున్నారు వెన్నెల కిషోర్.