మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో సందడి చేశాడు. కొండాపూర్ లోని బొటానికల్ గార్డెన్ రోడ్ లో ఉన్న చిరాక్ ఇంటర్నేషనల్ స్కూల్ లో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో రామ్ చరణ్ పాల్గొన్నాడు. దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన వీరులను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. స్వాతంత్ర సమరయోధుల జీవిత చరిత్రలను ప్రతి ఒక్కరు తప్పక తెలుసుకోవాలని, వారు చూపించిన బాటలో నడవాలని ఈ సందర్భంగా రామ్ చరణ్ పిల్లలకు తెలియజేశాడు.