వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి విశాఖ జిల్లా ఎర్రవరంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.ఎర్రవరం జంక్షన్ వద్ద పాదయాత్ర విడిది శిబిరం వద్ద వైఎస్ జగన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, వందనం చేశారు. స్వాతంత్ర్య సమరయోధుల చిత్ర పటాలకు పూలమాల వేసి నివాళి అర్పించారు. వారి త్యాగాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా దేశ ప్రజలందరికి వైఎస్ జగన్ శుభాకాంక్షాలు తెలిపారు. ఈ వేడుకల్లో వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రజాసంకల్పయాత్రకు బుధవారం వైఎస్ జగన్ విరామం ప్రకటించిన విషయం తెలిసిందే. గురువారం ఉదయం నుంచి పాదయాత్ర యథావిధిగా కొనసాగుతుంది.