జబర్దస్త్ కామెడీ షో ద్వారా పాపులరైన యాంకర్ అనసూయ భరద్వాజ్. యాంకర్ గా సక్సెస్ అయ్యాక సినీ రంగంపై దృష్టి సారించింది. చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ వచ్చిన అనసూయకు.. థ్రిల్లర్ సినిమా క్షణంతో మంచి బ్రేక్ వచ్చింది. అప్పుడప్పుడు ప్రత్యేక నృత్యాల్లో నటిస్తున్న ఈ యాంకరమ్మకు రంగస్థలంలో అనసూయమ్మత్త పాత్ర పెద్ద బ్రేక్ అని చెప్పాలి. ఈ పాత్రలో అనసూయ అద్భుతంగా నటించింది. అయితే స్వాతంత్ర్య దినోత్సవం రోజే అనసూయకు ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో తీవ్ర నిరాశకు గురయ్యారు.
ఈ కామెంట్లపై అనసూయ స్పందిస్తూ.. తనకు ఈ రోజు హ్యాపీ ఇండిపెండెన్స్ డే కాదన్నారు. అంతకు ముందు 72వ స్వాతంత్ర్య దినోత్సవం రోజు తొలిసారి జెండా ఎగురవేసినందుకు ఆనందంగా ఉందంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. అంతేకాకుండా ఈ అవకాశం ఇచ్చిన భువనగిరిలోని హోటల్ వివేరా యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుతూ, జెండా ఎగురవేసిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. స్వాతంత్రదినోత్సవ వేడుకల్లో, అది కూడా జాతీయ జెండాను ఎగిరేసే సమయంలో ఆ డ్రెస్ ఏంటి అంటూ నెటిజన్ల నుంచి కామెంట్ల రూపంలో విమర్శలు వచ్చాయి. అనసూయ కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా బుధవారం ట్రిప్‌కు వెళ్లారు. కాగా తిరుగు ప్రయాణం అవుతుండగా హోటల్ వివేరాలో టిఫిన్ చేయడానికి ఆగారు. అదే సమయంలో హోటల్ వివేరా యాజమాన్యం వారు స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా జెండా ఎగరవేయడానికి ఏర్పాట్లు చేశారు. అనసూయ సెలబ్రిటీ కావడంతో ఆమెను జెండా ఎగరవేయాల్సిందిగా కోరారు. దీనికి అనసూయ కూడా అంగీకరించి, జాతీయ జెండాను ఎగురు వేశారు. అనుకోకుండా అప్పటికప్పుడు హోటల్ యాజమాన్యం వారు తనను జాతీయ జెండా ఎగురవేయాలని కోరడంతో జెండా ఎగురవేశానని అనసూయ తెలిపారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారి కామెంట్లను చదివి వినిపిస్తూ.. ఒకానొక సమయంలో అనసూయ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. తన వస్త్రాధరణపై నెగటివ్‌గా కామెంట్లు పెడుతున్నవారిని బ్లాక్ చేస్తూ, తనలా ఆలోచించే వాళ్లు పదిమంది ఫాలోవర్లు ఉన్నా చాలని తెలిపారు. తన పోస్ట్‌లో (#HappyorNot) హ్యాపీ ఆర్ నాట్ అనే హ్యాష్ ట్యాగ్ ను కూడా జోడించారు. ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో పోస్ట్ చేసిన వీడియోను కొద్దిసమయం తర్వాత అనసూయ డిలీట్ చేశారు.