మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘సైరా’ సినిమా కోసం కొత్త సెట్ సిద్ధమైంది. షూటింగ్ నేటి నుంచి ప్రారంభం కానున్నట్టు తెలుస్తుంది. షూటింగ్‌కు కొంచెం విరామం వచ్చిన కారణంగా ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకూడదనే ఉద్దేశంతో చిత్రబృందం ఉన్నట్టు సమాచారం. దీంతో నెలరోజులపాటు ఏకధాటిగా షూటింగ్ చేయనున్నట్టు సమాచారం. ఈ సెట్లోనే బ్రిటిషర్లతో సైరా నరసింహారెడ్డికి మధ్య జరిగే పోరాట సన్నివేశాలను చిత్రీకరించనున్నట్టు తెలుస్తోందిఇ. శేరిలింగపల్లిలో వేసిన సైరా సెట్‌ను ఇటీవల రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. అనుమతి లేకుండా సెట్ వేశారనే కారణంగా రెవెన్యూ అధికారులు కూల్చివేశారు.
అనుమతి లేకుండా సెట్ వేశారనే కారణంగా రెవెన్యూ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో షూటింగ్ నిలిచిపోయింది. సెట్ కూల్చివేత వివాదాస్పదమైంది. ఈ వివాదం తేలే వరకు ఆగితే సినిమా విడుదల ఆలస్యం అవుతుందని, నిర్మాత నష్టపోవాల్సి వస్తుందని భావించింది చిత్రబృందం. మరోవైపు షూటింగ్ కూడా లేట్ అవుతుండటం.. దీని ప్రభావం విడుదలపై పడుతుందని భావించిన చిత్రబృందం మరో ప్రాంతంలో సెట్ వేసింది. ఈ చిత్రాని సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు. కాగా నయనతార హీరోయిన్గా నటించగా బిగ్ బీ అమితాబ్ బచ్చన్, జగపతిబాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.