HomeTelugu News'సైరా' టీజర్‌ పై చిరంజీవి తల్లి, భార్య ప్రశంసలు

‘సైరా’ టీజర్‌ పై చిరంజీవి తల్లి, భార్య ప్రశంసలు

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న 151వ చిత్రం సైరా నరసింహారెడ్డి. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఆగస్టు 22 రేపు(బుధవారం) చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఒకరోజు ముందే అంటే ఈ రోజు(మంగళవారం) ఉదయం 11:30గంటలకు రిలీజ్ చేసింది చిత్రబృందం. కాగా ఈ ‘సైరా’ మూవీ టీజర్ రిలీజ్ ఈవెంట్‌ ప్రసాద్ ల్యాబ్స్‌లో వైభవంగా జరిగింది. టీజర్‌ను ప్రతి ఒక్కరికీ నచ్చేలా అద్భుతంగా విడుదల చేసింది చిత్రబృందం. మాటలు పెద్దగా లేకున్నా.. సినిమా రేంజ్‌ను టీజర్‌లో చూపించారు మూవీ యూనిట్‌.

5 23

 

ఈ సందర్భంగా రామ్ చరణ్ తన నానమ్మ అంజనా దేవితో మాట్లాడించారు. ఆమె టీజర్ ఎలా ఉందో తెలిపారు. ‘టీజర్ అదిపోయిందండి.. చాలా బాగుంది’ అని అంజనాదేవి వెల్లడించారు. అనంతరం రామ్ చరణ్ తల్లి సురేఖ మాట్లాడుతూ ‘చాలా చాలా బాగుంది. మాటలు సరిపోవు. సురేందర్ రెడ్డిగారికి చాలా చాలా థాంక్స్. చాలా బాగా చేశారు’ అని ప్రశంసించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu