మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా నటించనుంది. అతికీలక పాత్ర కోసం ఆమెను ఎంపిక చేశాడు దర్శకుడు సురేందర్ రెడ్డి…బాహుబలి సినిమాలోని పాత్రను పోలి ఉంటుందని సమాచారం. ఇందులో కూడా ఆమె పోరాట దృశ్యాలలో పాల్గొంటున్నది…దీనికి తోడు పాత్ర పరంగా ఆమె భరత నాట్య కళాకారిణి కూడా.. దీనికోసం ఆమె ప్రత్యేక శిక్షకుడి వద్ద నాట్యంలో శిక్షణ తీసుకోంటోంది.
ఈ చిత్రానికి రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. చిరంజీవి సరసన నయనతార కథానాయికగా కనిపించనున్నది. ఇక బిగ్ బి అమితాబ్, విజయ్ సేతుపతి, సునీల్ తదితరులు ఈ మూవీలో నటిస్తున్నారు.