HomeTelugu Newsసెలబ్రిటీలను ఊపేస్తున్న ఫిట్‌నెస్ ఫీవర్

సెలబ్రిటీలను ఊపేస్తున్న ఫిట్‌నెస్ ఫీవర్

హమ్ ఫిట్ హై తో ఇండియా ఫిట్. ఇప్పుడు ఇండియాను ఊపేస్తున్న ఛాలెంజ్ ఇది. రోజురోజుకూ ఈ సవాల్, ప్రతిసవాళ్లు పెరిగిపోతున్నాయి. టాలీవుడ్‌లోనూ హీరోలు, హీరోయిన్లు తమ సత్తాచూపిస్తున్నారు. తాజాగా తన కొడుకు అఖిల్ విసిరిన ఛాలెంజ్‌ను నాగార్జున తీసుకున్నాడు. దానికి ముందు మోహన్‌లాల్ విసిరిన ఛాలెంజ్‌ను ఎన్టీఆర్ తీసుకున్నాడు. ఎన్టీఆర్ ఛాలెంజ్‌ను తీసుకోవడమే కాకుండా చరణ్, మహేష్, కల్యాణ్‌రామ్‌కు ఛాలెంజ్‌లు విసిరాడు. ఒకవేళ చరణ్ మర్చిపోతాడేమో ఉపాసన గుర్తు చేయాలంటూ తన మాటగా చెప్పమన్నాడు కూడా హీరోయిన్లు కూడా ఇదే పనిలో ఉన్నారు. రకుల్‌, సమంత ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌ తీసుకున్నారు. వాళ్ల జిమ్ వీడియోలు అప్‌లోడ్‌ చేశారు.

1 1

అక్కినేని వారసులు నాగచైతన్య, అఖిల్ ఫిట్‌నెస్ నిరూపించుకున్నారు. ఈ ఫిట్‌నెస్ ఛాలెంజ్‌లో ఎవ్వరికి ఎవ్వరూ తగ్గడం లేదు. తమ ఏజ్‌ కూడా పట్టించుకోకుండా రెచ్చిపోతున్నారు స్టార్స్. నాగార్జున, మోహన్‌లాల్‌ వంటి హీరోలు కుర్రాళ్లతో సమానంగా చేస్తూ తమ ఫిట్‌నెస్‌తో పిచ్చెక్కిస్తున్నారు. ఎవరూ ఈ ఛాలెంజ్‌ను లైట్ తీసుకోవడం లేదు. అంతా సీరియస్‌గా దృష్టిపెడుతూ ఇండియాను ఫిట్‌గా ఉంచే పనిలో బిజీగా ఉన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu