HomeLatestసెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న 'చుట్టాలబ్బాయి' ..ఆగస్ట్ 19న గ్రాండ్ రిలీజ్

సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ‘చుట్టాలబ్బాయి’ ..ఆగస్ట్ 19న గ్రాండ్ రిలీజ్

సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న  చుట్టాలబ్బాయి‘ ..ఆగస్ట్ 19న గ్రాండ్  రిలీజ్

లవ్‌లీ రాక్‌స్టార్‌ ఆది హీరోగా హిట్‌ చిత్రాల దర్శకుడు వీరభద్రమ్‌ దర్శకత్వంలో శ్రీ ఐశ్వర్యలక్ష్మి మూవీస్‌, ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై వెంకట్‌ తలారి, రామ్‌ తాళ్లూరి నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘చుట్టాలబ్బాయి’. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్ ను పొందింది. సినిమా ఆగస్ట్‌19న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌కి సిద్ధమైంది. 

ఈ సందర్భంగా నిర్మాతలు వెంకట్‌ తలారి, రామ్‌ తాళ్ళూరి మాట్లాడుతూ – ”ఆది, వీరభద్రమ్‌ల కాంబినేషన్‌లో చక్కని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న మా ‘చుట్టాలబ్బాయి’ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్ ను పొందింది. ఈ చిత్రాన్ని ఆగస్ట్‌ 19న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చేయబోతున్నాం. ఈ సినిమా పాటలకు,థియేట్రికల్ ట్రైలర్ కు  అన్నిచోట్ల నుంచి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. ‘ప్రేమకావాలి’, ‘లవ్‌లీ’ చిత్రాల తర్వాత ఆదికి ‘చుట్టాలబ్బాయి’ మరో సూపర్‌హిట్‌ సినిమా అవుతుంది. అలాగే ‘అహనా పెళ్ళంట’, ‘పూలరంగడు’ తర్వాత వీరభద్రమ్‌ రూపొందిస్తున్న మరో సూపర్‌హిట్‌ మూవీ ఇది. ఈ చిత్రం సూపర్‌హిట్‌ అయి మా బేనర్స్‌కి కూడా చాలా మంచి పేరు తెస్తుంది” అన్నారు. 

లవ్‌లీ రాక్‌స్టార్‌ ఆది, నమిత ప్రమోద్‌, డైలాగ్‌కింగ్‌ సాయికుమార్‌, బ్రహ్మానందం, పోసాని క ష్ణమురళి, ప థ్వి, రఘుబాబు, క ష్ణభగవాన్‌, అభిమన్యు సింగ్‌, జీవా, సురేఖావాణి, షకలక శంకర్‌, చమ్మక్‌ చంద్ర, రచ్చ రవి, గిరిధర్‌, అనితనాథ్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎస్‌.ఎస్‌. థమన్‌, సినిమాటోగ్రఫీ: ఎస్‌.అరుణ్‌కుమార్‌, ఆర్ట్‌: నాగేంద్ర, ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, మాటలు: భవాని ప్రసాద్‌, స్టిల్స్‌: గుణకర్‌, నిర్మాతలు: వెంకట్‌ తలారి, రామ్‌ తాళ్ళూరి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వీరభద్రమ్‌. 

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu