సునిల్ కెరీర్లోనే పెద్ద కమర్షియల్ సక్సస్ ని అందించిన ప్రేక్షకదేవళ్ళకి మా ధన్యవాదాలు.
…నిర్మాత ఆర్.సుదర్శన్‌రెడ్డి
సునీల్ హీరోగా, మన్నార్ చోప్రా జంటగా, ప్రేమకథాచిత్రమ్ తరువాత ఆర్.పి.ఎ.క్రియేషన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.2గా.. వంశీ కృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో రూపొందించిన జక్కన్న చిత్రం జులై 29న విడుదలయ్యింది. విడుదల రోజు మిక్స్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం మెదటిరోజు 3.78 కొట్ల షేర్ తో సునిల్ కెరీర్ లో రికార్డు గా నిలిచింది. రెండవ రోజు కొంత వరకూ కలెక్షన్లు తగ్గినా మూడవ రోజు నుండి 12 రోజుల వరకూ ఇటీవల కాలంలో సునిల్ కెరీర్లో ద బెస్ట్ కమర్షియల్ సక్సస్ గా నిలించింది. 12 రోజులకి 15.28 కోట్ల పైచిలుకు షేర్ వసూలు చేసి కామెడి చేసి తన సత్తా చాటుకున్నాడు సునిల్. ప్రతీ సీన్ ను హిలేరియస్ గా మలిచిన ఈ చిత్రం సునీల్ కెరీర్లో మరో సూపర్ హిట్ గా నిలించింది.
ఈ సందర్బంగా చిత్ర నిర్మాత సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ… మా జక్కన్నచిత్రం అత్యధిక థియేటర్లలో విడుదల చేశాం. సినిమాకు ముందునుంచి ఉన్న క్రేజ్ కు ఏ మాత్రం తగ్గకుండా హౌస్ ఫుల్ కలెక్షన్స్ సాధించింది. సునీల్ కెరీర్లోనే బెస్ట్ ఓపెనింగ్స్ సాధించటమే కాకుండా అతని కి రీ-ఎంట్రి సూపర్‌హిట్ గా చిత్రం జక్కన్న. అన్ని ఏరియాల నుంచి కలెక్షన్లు సూపర్ గా వచ్చాయి. 12 రోజులకే 15.28కొట్ల షేర్ వసూలు చేయటం చాలా ఆనందంగా వుంది. ముఖ్యంగా మేం అనుకున్నట్టుగా కామెడీ బాగా వర్కవుట్ అయ్యింది. హిలేరియస్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. విడుదలైన అన్ని సెంటర్లలోనూ మూడవ వారం కూడా రన్నింగ్ లో వుంది. అని అన్నారు.