యంగ్ హీరో సుధీర్ బాబు తాజాగా నటించిన చిత్రం సమ్మోహనం. ఈ చిత్రంతో అతను కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ సాధించాడు. ఇదే సమయంలో ఎస్ బి ప్రొడక్షన్ పేరుతో సొంత నిర్మాణ సంస్థను ఏర్పాటు చేశాడు..ఈ బ్యానర్‌లో తొలి చిత్రం ద్వారా ఆర్ ఎస్ నాయుడు అనే దర్శకుడిని టాలీవుడ్‌కు పరిచయం చేస్తున్నాడు సుధీర్ బాబు.
తన బ్యానర్ పై వస్తున్న తొలి చిత్రంలో సుధీర్ బాబే హీరోగా నటిస్తున్నాడు. ఇక ఈ మూవీకి ‘నన్ను దోచుకుందువటే’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. అలాగే ఈ రోజు ఈ మూవీ మోషన్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఈ మూవీకి అంజనీష్ సంగీతం సమకూరుస్తున్నారు. సురేష్ రాగుతు సినిమాటోగ్రఫీ, చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు.