HomeTelugu Newsసాక్ష్యం మూవీ రివ్యూ

సాక్ష్యం మూవీ రివ్యూ

జయ జానకీ నాయక సినిమాతో మంచి విజయం అందుకున్న బెల్లంకొండ శ్రీనివాస్‌ అదే జోరుతో సాక్ష్యం సినిమాతో మరోసారి ప్రేక్షకులను వచ్చాడు. ఈ చిత్రానికి శ్రీవాస్‌ దర్శకత్వం వహించారు. భారీ బడ్జెట్‌తో యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ద్వారా బెల్లంకొండ మరో విజయం అందుకోబోతున్నాడా..? ఇప్పటి వరకు కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చిత్రాలను మాత్రమే తెరకెక్కించిన శ్రీవాస్‌ ఈ సినిమాతో భారీ యాక్షన్ చిత్రాలను కూడా తీయగలనని నిరూపించుకున్నాడా.. తెలియాలంటే రివ్యూ చూడాల్సిందే..

2 29

కథ:
ఈ చిత్రంలో విలన్ మును స్వామి(జగపతిబాబు) అతని బ్రదర్స్ చేసే అరాచకాలకు అడ్డుపడుతున్నాడని స్వస్తిక్ నగరం అనే చారిత్రాత్మక ప్రాంతంలో ఉండే పెద్దమనిషి రాజుగారు (శరత్ కుమార్) కుటుంబాన్ని సర్వనాశనం చేస్తారు. ఆకుటుంబంలో పిల్లలు, పశువులు సహా అందరినీ చంపేస్తారు. రాజుగారి భార్య తనకు లేక లేక పుట్టిన కొడుకు విశ్వ (బెల్లంకొండ శ్రీనివాస్)ను లేగదూడకు కట్టి తప్పిస్తుంది. అలా తప్పించుకున్న ఆ పిల్లాడిని ఓ వ్యక్తి కాశీ తీసుకెళ్లి వదిలేస్తాడు. పిల్లలు లేని శివప్రకాష్ (జయప్రకాష్) దంపతులు ఆ పిల్లాడిని పెంచుకుంటారు. విదేశాల్లో పెరిగి పెద్దవాడై 20 ఏళ్ల తర్వాత ఇండియాకు తిరిగి వస్తాడు. తనకు తెలియకుండానే తన శత్రువులను ఎలా అంతమొందించాడనేది మిగతా కథ.

నటీనటులు :
ప్రతి సినిమాలో పరిణతి చూపిస్తున్న బెల్లంకొండ శ్రీనివాస్ ఈచిత్రంలో మరోసారి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఎమోషనల్‌ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన సాక్ష్యం సినిమాలో బెల్లంకొండ మరింతగా మెప్పించాడు. పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన సినిమాకు తాను పూర్తి న్యాయం చేశాడు. ముఖ్యంగా యాక్షన్‌, డ్యాన్స్‌లు బాగా చేశాడు. ఎమోషన్‌ డైలాగ్స్‌ చెప్పే సన్నివేశాల్లో ఇంకాస్త మెరుగుపడాలనిపిస్తుంది. సౌందర్య లహరి పాత్రలో పూజా హెగ్డే చక్కగా చేసింది. తన గ్లామర్‌, లుక్స్‌తో అదరగొట్టింది. విలన్‌ గా జగపతి బాబు మరోసారి తన మార్క్‌ చూపించారు. వేమన పద్యాలు చెపుతూ కొత్త విలనిజం పండించారు. జగపతి బాబు తమ్ముళ్లుగా అశుతోష్‌ రానా, రవికిషన్‌లు తమ పాత్రకు న్యాయం చేశారు. జయప్రకాష్, పవిత్రాలోకేష్, రావు రమేష్, వెన్నెలకిషోర్ వాళ్ల పాత్రకు పూర్తి న్యాయం చేశారు.

2a 3

విశ్లేషణ:
దర్శకుడు శ్రీవాస్ పక్కా కమర్షియల్ ఫార్మాట్‌లో సినిమాను తెరకెక్కించాడు. బెల్లంకొండ శ్రీనివాస్‌కు వచ్చిన మాస్‌ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని ఎక్కువగా యాక్షన్‌, ఎమోషనల్‌ సీన్స్‌తో కథ నడిపించాడు. కథానాయకుడు తన తల్లిదండ్రులను చంపిన వారిని ఇరవై ఏళ్ల తర్వాత మళ్లీ చంపాడు అనే పాయింట్‌ చాలా బలహీనంగానూ, రొటీన్‌గానూ కనిపిస్తుంది. అయితే దానికి పంచభూతాలు అనే నేపథ్యాన్ని తెలివిగా జోడించాడు దర్శకుడు. ఫస్ట్ హాఫ్‌లో యాక్షన్‌, రొమాన్స్‌, కామెడీ బ్యాలెన్స్ చేసిన
దర్శకుడు సెకండాఫ్ పూర్తిగా యాక్షన్‌, ఎమోషనల్‌ డ్రామాతో నడిపించాడు. యాక్షన్‌ ఎపిసోడ్‌ ఒక్కోటి ఒక్కో తరహాలో సాగుతుంది. పంచ భూతాలను యాక్షన్‌ ఎపిసోడ్‌లో మేళవించాలన్న ఆలోచన రొటీన్‌ కథను సరికొత్తగా ఆవిష్కరించింది. క్లైమాక్స్ సన్నివేశాలు ఊహించినట్లు సాగినప్పటికీ మాస్‌ను ఆకట్టుకునే ప్రయత్నం జరిగింది. ఒక సాధారణ కథను, కొత్త నేపథ్యంలో భారీ హంగులు జోడించి, తెరకెక్కించడంలో దర్శకుడు సఫలమయ్యాడని చెప్పొచ్చు. నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్‌. పాటలు వినడానికి, చూడటానికి బాగున్నా కథనం మధ్యలో స్పీడు బ్రేకర్లలా అనిపిస్తాయి. సినిమాటోగ్రఫీ బాగుంది.

హైలైట్స్
పంచ భూతాల కాన్సెప్ట్
యాక్షన్ ఎపిసోడ్స్
రొటీన్‌ కథను సరికొత్తగా ఆవిష్కరించడం
నిర్మాణ విలువలు

డ్రాబ్యాక్స్
కథకు బ్రేక్ వేసేలా మధ్యలో పాటలు

చివరిగా : సాధారణ కథకు కొత్త హంగులే “సాక్ష్యం”
(గమనిక : ఇది కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)

సినిమా : సాక్ష్యం
నటీనటులు : బెల్లంకొండ శ్రీనివాస్‌, పూజ హెగ్డే, జగపతి బాబు, వెన్నెల కిశోర్‌
దర్శకత్వం : శ్రీవాస్‌
నిర్మాతలు : అభిషేక్‌ నామా
సంగీతం : హర్షవర్థన్‌ రామేశ్వర్‌

Recent Articles English

Gallery

Recent Articles Telugu

జయ జానకీ నాయక సినిమాతో మంచి విజయం అందుకున్న బెల్లంకొండ శ్రీనివాస్‌ అదే జోరుతో సాక్ష్యం సినిమాతో మరోసారి ప్రేక్షకులను వచ్చాడు. ఈ చిత్రానికి శ్రీవాస్‌ దర్శకత్వం వహించారు. భారీ బడ్జెట్‌తో యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ద్వారా బెల్లంకొండ మరో విజయం అందుకోబోతున్నాడా..? ఇప్పటి వరకు కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చిత్రాలను మాత్రమే తెరకెక్కించిన శ్రీవాస్‌ ఈ సినిమాతో...సాక్ష్యం మూవీ రివ్యూ