బెల్లంకొండ శ్రీనివాస్, పూజాహెగ్డే జంటగా నటిస్తున్న సినిమా సాక్ష్యం. అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. టీజర్ ఇటీవలే విడుదల చేశారు. ఈ క్రేజీ యాక్షన్ చిత్రాన్ని జులై 20వ తేదిన విడుదల చేయనున్నారు. గతంలో జూన్ 14న విడుదల చేయనున్నట్లు ప్రకటించిన చిత్ర యూనిట్ తాజాగా రిలీజ్ తేది మార్చింది…ఈ మేరకు అధికారికంగా పోస్టర్‌ను విడుదల చేసింది.
నిర్మాత మాట్లాడుతూ సినిమా చాలా కొత్తగా ఉండనుంది. అన్నీ కమర్షియల్ అంశాలు జోడించి, ప్రకృతి కేంద్రబిందువుగా రూపొందుతోంది. అమెరికా షెడ్యూల్ ఇటీవలే పూర్తిచేశాం. దుబాయ్, వారణాసిలో కూడా షూటింగ్ చేశాం. ఆ తరువాత రాజమండ్రిలో ప్రారంభమైన తాజా షెడ్యూల్ కూడా ముగిసిందని తెలిపారు. ఇతర పాత్రల్లో జగపతిబాబు, శరత్‌కుమార్, మీనా, జయప్రకాష్, పవిత్ర లోకేష్, బ్రహ్మాజీ, లావణ్య తదితరులు నటిస్తున్నారు. ఛాయాగ్రహణం ఆర్థర్ ఎ. విల్సన్, మాటలు సాయిమాధవ్, హర్షవర్ధన్ సంగీతం అందిస్తున్నారు.