నటన, జీవితం, ప్రేమ, పెళ్లి వంటి వ్యక్తిగత జీవితాలను గెలుపు బాటలో నడిపిస్తున్న అరుదైన నటి సమంత. చాలా ధైర్యం గల కథానాయికల్లో సమంత ఒకరు. ఈమె తన కంటు కచ్చితమైన అభిప్రాయాలు కలిగిన నటి. తన మనస్సులోని భావాలను నిర్మోహమాటంగా వెల్లడించగలరు. సాధారణంగా వివాహనంతరం హీరోయిన్‌గా రాణించడం కష్టమే. అయితే దాన్ని సమంత సులభంగా బ్రేక్ చేసి వరుస విజయాలను తన ఖాతాలో వేసుకోంటోంది. ఇటీవలే తెలుగు చిత్రం రంగస్థలం, ద్విభాషా చిత్రం నడిగైయార్ తిలగం, తమిళ చిత్రం ఇరుంబుతిరై అంటూ వరుస విజయాలను అందుకోంటుంది సమంత.
ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలెంజ్‌లు ట్రెండ్ అవుతున్నాయి. గతంలో ఐస్ బకెట్ చాలెంజ్, ప్యాడ్‌మాన్ చాలెంజ్‌లు ట్రెండ్ అయిన సంగతి తెలిసిందే. “హమ్‌ఫిట్ తో ఇండియాఫిట్ చాలెంజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఒలింపిక్ విజేత, కేంద్ర క్రీడా శాఖ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్‌తో మొదలై విరాట్, హృతిక్, అనుష్క శర్మ, సైనాలు సహా ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ చాలెంజ్‌ను స్వీకరించిన వారిలో ఉన్నారు.
ఇక ఇప్పుడు ఈ కోవలోకి అక్కినేని కుటంబం కూడా చేరింది. తాజాగా నాగ చైతన్య ఈ చాలెంజ్‌ను స్వీకరించి, ఎక్సర్‌సైజ్ చేస్తున్న వీడియోను పోస్టు చేశారు. నాగచైతన్యను అఖిల్ సవాలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు నాగచైతన్య తన భార్య సమంతను, అక్కినేని సుమంత్, నిధి అగర్వాల్‌కు ఫిట్‌నెస్ సవాలును విసిరారు.
దీని గురించి సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక క్యూట్ మెసేజ్ పోస్ట్ చేశారు. “హమ్‌ఫిట్‌తో ఇండియాఫిట్ చాలెంజ్ నాకు చాలా నచ్చింది. కళ్లకు, మనసుకు చాలా తేలికగా అనిపిస్తుంది. చై…. నేను నీ సవాల్‌ను స్వీకరిస్తున్నాను. కానీ నువ్వు పోస్టు చేసిన వీడియో చూసి నేను అలసిపోయాను. కాబట్టి రేపు నేను నీ సవాల్‌ను పూర్తి చేస్తాను” అంటూ పోస్టు చేశారు.సమంత పోస్టు చేయబోయే ఎక్సర్‌సైజ్ వీడియో కోసం చై కంటే సామ్ అభిమానులే ఎక్కువ ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. సమంత ప్రస్తుతం యూటర్న్ సినిమాలో స్వయంగా తానే నటిస్తూ తొలిసారి నిర్మాతగా మారారు.