HomeTelugu Big Storiesశ్రీరెడ్డి ఆరోపణలపై టి. రాజేందర్ ఏమన్నారు?

శ్రీరెడ్డి ఆరోపణలపై టి. రాజేందర్ ఏమన్నారు?

క్యాస్టింగ్‌ కౌచ్‌ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిన శ్రీరెడ్డి తన మాటలు, ట్వీట్స్‌, పోస్ట్‌ తో సోషల్‌ మీడియాలో పులువురిపై ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు టాలీవుడ్‌లో కొందరు ప్రముఖులపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి తాజాగా కోలీవుడ్‌లోని ప్రముఖులపై చేస్తున్న ఆరోపణలు వివాదాస్పదంగా మారాయి. ఇప్పటికే కోలివుడ్‌ సార్ట్‌ డైరెక్టర్‌ ఏ. ఆర్‌. మురుగదాస్‌, రాఘవ లారెన్స్‌, శ్రీరామ్‌లపై శ్రీరెడ్డి సంచలన ఆరోపణలు చేసింది.

5 14

శ్రీరెడ్డి చేస్తున్న ఆరోపణలపై ప్రముఖ దర్శకుడు, నటుడు టి.రాజేందర్‌ స్పందించారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. శ్రీరెడ్డి విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు సమాధానం చెప్పి సమస్యను ఇంతటితో ముగింపు పలికితే మంచిదన్నారు. సినిమా ఇండస్ర్టీలో మంచి చెడు రెండూ ఉంటాయని, క్యాస్టింగ్‌ కౌచ్‌ ఇండస్ర్టీలో సహజమే, కానీ మా కాలంలో నా వ్యక్తిగతంగా నేను నటించిన, దర్శకత్వం వహించిన సినిమాల్లో ఏ కథానాయికను కనీసం టచ్‌ కూడా చేయలేదని గుర్తు చేశారు. ప్రస్తుతం సినిమాలు అలా కాదని రాజేందర్‌ అన్నారు. సినీ పరిశ్రమలో ఇటువంటి వివాదాలు ఎక్కువకావడం మంచిది కాదని అన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu