అతిలోక సుందరి శ్రీదేవి.. అభిమానులను శోకసంద్రంలో ముంచేసి అనంత లోకాలకు వెళ్లిపోయింది. శ్రీదేవి మరణంతో భారతీయ సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురై కన్నీటి సంద్రమే అయింది. అయితే శ్రీదేవి గుండెపోటుతో చనిపోలేదన్న వార్తలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. అందం కోసం తీసుకున్న స్టెరాయిడ్స్ ఆమెను మరణానికి చేరువ చేశాయన్న వార్తలు అభిమానులను కలచి వేస్తున్నాయి. అందం తరిగిపోకుండా ఉండేందుకు ఆమె స్టెరాయిడ్స్ తీసుకునేవారని.. అవి మోతాదు మించడం వల్లే.. ఆమెకు గుండెపోటు వచ్చిందని వార్తలు వినిపిస్తున్నాయి. దుబాయ్ లో మేనల్లుడి వివాహ వేడుకలో అందరితో ఆడిపాడి సందడి చేసిన శ్రీదేవి.. అంతలోనే ఎందుకు చనిపోయింది.
సుమారు 48 గంటల పాటు హోటల్ రూమ్ నుంచి ఎందుకు బయటకు రాలేదు. చివకు బాత్ టబ్ లో మృతురాలై కనిపించడం వెనుక అసలు రహస్యమేంటి..? రాత్రి తొమ్మది గంటల సమయంలో విగతజీవిగా పడిఉన్న శ్రీదేవిని చూసిన బోనీ కపూర్.. ఆమెను ఆస్పత్రికి తరలించడంలో ఎందుకు ఆలస్యం చేశారు..? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు అందరి మదిని తొలిచేస్తున్నాయి. శ్రీదేవికి సుమారు 50 కోట్ల ఇన్సూరెన్స్ ఉందని.. దాని కోసమే సన్నిహితులు ప్రయత్నిస్తున్నారన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఇన్సూరెన్స్ క్లైమ్ కోసమే.. దుబాయ్ లో ఆమె మృతదేహానికి పోస్టుమార్ట్ చేయాలని బోనీకపూర్ ఫ్యామిలీ అడిగారని.. పోస్టుమార్టమ్ వల్లే శ్రీదేవి భౌతికకాయం భారత్ కు రావడం ఆలస్యమైందనే ఊహాగానాలు బాలీవుడ్ లో బలంగా వినిపిస్తున్నాయి.