HomeTelugu Newsశ్రీదేవి అవార్డు అందుకున్న ప్రియాంక

శ్రీదేవి అవార్డు అందుకున్న ప్రియాంక

2018 జార్ఖండ్‌ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో బాలీవుడ్‌ కథానాయిక ప్రియాంక చోప్రాకు అరుదైన గౌరవం దక్కింది. ఈ ఉత్సవంలో ప్రియాంకను ‘శ్రీదేవి ఎక్సలెన్స్‌ అవార్డు’ తో సత్కరించారు. ఈ అవార్డును ఆమె తరఫున చిత్రోత్సవానికి హాజరై ఆమె తల్లి మధు చోప్రా అందుకున్నారు. దర్శకుడు మహేశ్‌ భట్‌ అవార్డును ఆమెకు ప్రదానం చేశారు. ఈ మేరకు ప్రియాంక చోప్రా వీడియో సందేశం ద్వారా ధన్యవాదాలు చెప్పారు. శ్రీదేవి స్మారక అవార్డును అందుకోవడం చాలా గొప్పగా ఉందన్నారు. ఆమె తనకు ఇష్టమైన నటి అని పేర్కొన్నారు.

9 1

ప్రియాంక గత కొన్నేళ్లుగా పలు హాలీవుడ్‌ సినిమాలు, అమెరికన్‌ టీవీ సిరీస్‌ ‘క్వాంటికో’ షూటింగ్‌లతో బిజీగా ఉన్నారు. 2016 ‘జై గంగాజాల్‌’ తర్వాత ఆమె బాలీవుడ్‌లో తాజాగా ‘భారత్‌’ అనే చిత్రానికి సైన్‌ చేశారు. ఇందులో ఆమె సల్మాన్‌కు జంటగా నటించనున్నారు. ఇందులో దిశా పటానీ, టబు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అలీ అబ్బాస్‌ జఫర్‌ దర్శకుడు. 2019 రంజాన్‌కు ఈ సినిమా విడుదల కాబోతోంది

Recent Articles English

Gallery

Recent Articles Telugu