HomeTelugu Big Storiesశ్రియా, అనిన్‌దిత్‌ పెళ్లిలో తారల సందడి

శ్రియా, అనిన్‌దిత్‌ పెళ్లిలో తారల సందడి

అక్కినేని వారి ఇంట కోడలుగా అడుగుపెట్టబోయే ఆఖరి నిమిషంలో ఆగిపోయిన ఫ్యాషన్‌ డిజైనర్‌, ప్రముఖ పారిశ్రామిక వేత్త జీవీకే రెడ్డి మనవరాలు  శ్రియా భూపాల్‌ పెళ్లి నిన్న (శుక్రవారం) ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కుమారుడు అనిన్‌దిత్‌రెడ్డితో జరిగింది. అంతేకాక హీరో రామ్‌ చరణ్ భార్య ఉపాసనకు కజిన్‌ కూడా. ఈ వేడుకకు రామ్‌ చరణ్‌, మహేశ్‌ బాబు, నమ్రతా శిరోద్కర్‌ తదితర టాలీవుడ్‌ స్టార్లందరూ హాజరయ్యారు. శ్రియా అనిన్‌దిత్‌ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. శ్రియా భూపాల్‌, వజ్రాల నెక్లెస్‌తో తరుణ్ తహిలియానీ డిజైన్‌ చేసిన చీరిలో మెరిసిపోయింది. పెళ్లి కొడుకు అనిన్‌దిత్‌, క్లాసిక్‌ శెర్వానీతో సింపుల్‌ లుక్‌లో కనిపించాడు.

2b

ఉపాసనకు అనిన్‌దిత్‌ కజిన్‌ కాగ, శ్రియా వదిన దియా, నమ్రతా శిరోద్కర్‌కు క్లోజ్‌ ఫ్రెండ్‌. నమ్రతా పిల్లలతో పాటు ఈ వివాహానికి హాజరయ్యారు. సానియా మిర్జా, ప్రజ్ఞా జైస్వాల్‌, లావణ్యలు కూడా ఈ వేడుకలో సందడి చేశారు. శ్రియా భూపాల్‌కు అఖిల్‌తో నిశ్చితార్థం జరిగిన తర్వాత పెళ్లి క్యాన్సిల్ కావడం అప్పట్లో సంచలనం రేపింది. దీనిపై ఇరు కుటుంబాలు పెద్దగా స్పందించకపోగా.. ఈ వ్యవహారం అప్పట్లో పెద్ద హాట్‌టాఫిక్‌ కూడా మారింది. కాగా అఖిల్‌ మాత్రం పెళ్లి ప్రస్తావన పక్కన పెట్టేసి, సినిమాలపై ఎక్కువగా శ్రద్ధ చూపుతున్నారు.

2a

Recent Articles English

Gallery

Recent Articles Telugu