జీ స్టూడియోస్ సమర్పణలో సెన్సేషనల్ స్టార్ షకీలా నటిస్తున్న 250వ చిత్రం ‘శీలవతి’. రాఘవ ఎమ్ గణేష్, వీరు బాసింశెట్టి నిర్మాతలుగా, సాయిరామ్ దాసరి దర్శకత్వంలో కేరళలో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా రూపోందింది. కాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఆగస్టు 17న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా షకీలా మాట్లాడుతూ.. ”ఈ చిత్రం నాకు చాలా స్పెషల్. ఇది నా 250వ చిత్రం. ఈ చిత్రంలో చాలా ప్రాముఖ్యమున్న పాత్రలో నటించాను. నెక్స్ట్ సీన్ ఏంటి అనే ఉత్కంఠ కలిగేలా దర్శకుడు సినిమాని తెరకెక్కించారు. నిర్మాతలిద్దరూ సినిమా కోసం ఏం కావాలన్నా అందించారు. ఆగస్ట్ 17న వస్తున్న ఈ ‘శీలవతి’ని అందరూ ఆదరిస్తారని భావిస్తున్నాను” అన్నారు.
నిర్మాతలు రాఘవ ఎమ్ గణేష్, వీరు బాసింశెట్టి మాట్లాడుతూ.. ”సెన్సార్ ట్రబుల్స్‌ని ఎదుర్కొని సక్సెస్‌ఫుల్‌గా ఆగస్ట్ 17న ‘శీలవతి’ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాం. దర్శకుడు సాయిరామ్ దాసరి సినిమాని అద్భుతంగా తెరకెక్కించారు. ఇది కేరళలో జరిగిన యథార్థ సంఘటన. ఈ సినిమా చూశాక.. ఇంతకు ముందు షకీలా వేరు ఇప్పటి షకీలా వేరు అని అందరూ అంటారు. తప్పకుండా అందరూ సినిమా చూసి మంచి విజయం అందిస్తారని కోరుకుంటున్నాం” అన్నారు. ఈ చిత్రంలో చిన్నా, అశోక్, కొండ, తిరుపతి తదితరులు నటిస్తున్నారు. ప్రజ్వల్ క్రిష్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.