కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార ప్రేమ వ్యవహారం ఇప్పటికీ పెద్ద సంచలనమే. మొదట్లో హీరో శింబు, ప్రభుదేవాలను ప్రేమించి విడిపోయిన నయన్ ప్రస్తుతం దర్శకుడు విగ్నేష్ శివన్ తో పీకల్లోతు ప్రేమలో ఉంది. తాజాగా నయనతార తన ప్రియుడితో ఉన్న పిక్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గతంలో వీరిద్దరి ప్రేమకు సంబంధించి వార్తలు వచ్చినప్పటికీ ఏ సందర్భంలోనూ వీరిద్దరూ వాటి గురించి ప్రస్తావించలేదు. కానీ ఇటీవల ఇద్దరు కూడా తమ పిక్స్‌ను బహిరంగంగా సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.
ఇటీవలే నయన్, విఘ్నేశ్ శివన్ జంట అమెరికా వెళ్లింది. కపుల్స్ గేట్ వే దగ్గర వీరు తీసుకున్న పిక్‌ను విఘ్నేశ్ ఇన్‌స్టాగ్రాంలో పంచుకున్నారు. వీరి ట్రిప్‌లో భాగంగా లాస్ ఏంజిల్స్‌లో వీరిద్దరూ తమ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహ్మాన్‌ను కలుసుకున్నారు. నిన్న స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని విగ్నేష్ శివన్ ఈ ఫోటో ఒకదాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. దానికి ఈ ప్రేమలో చాలా స్నేహం ఉంది.. ఈ స్నేహంలో చాలా ప్రేముంది అంటూ క్యాప్షన్ కూడ పెట్టారు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారి తెగ ట్రెండ్ అవుతోంది.