తెలుగు సినిమా ఇండస్ట్రీ మద్రాస్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన తరువాత ఇక్కడ అనేక స్టూడియోలు వెలిశాయి. రామానాయుడు, అన్నపూర్ణ, పద్మాలయ, రామకృష్ణ స్టూడియోలు ఇందులో ప్రధానమైనవి. ఆ తరువాత కాలంలో రామోజీ ఫిలింసిటీ నిర్మాణం జరిగింది. టాలీవుడ్ కు చెందిన సినిమాలే కాకుండా, ఇతర భాషా చిత్రాలు కూడా హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్నాయి.
కాగా తెలుగు ఉమ్మడి రాష్ట్రం తెలంగాణ, ఆంధ్రగా విడిపోయాక, ఆంధ్రప్రదేశ్ లో ఫిల్మ్ ఇండస్ట్రీని డెవలప్ చేయాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఫిల్మ్ స్టూడియోలను నిర్మించే వారికి ఆహ్వానం పలుకుతున్నది. విశాఖ వేదికగా స్టూడియోలు నిర్మించే వారికి అక్కడ పది ఎకరాల స్థలాన్ని ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది. సినీ నటుడు బాలకృష్ణ నటుడుగా ప్రూవ్ చేసుని.. ఇప్పుడు నిర్మాతగా మారి ‘ఎన్టీఆర్’ బయోపిక్ తీస్తున్నాడు.
అయితే బాలకృష్ణ ఇప్పుడు వైజాగ్ లో స్టూడియోను ఏర్పాటు చేయబోతున్నట్టు సమాచారం. స్టూడియోను కూడా ఏర్పాటు చేసుకుంటే సొంతంగానే సినిమాలు తీసుకోవడానికి అవకాశం మరింత అవకాశం దొరుకుతుంది. మరోవైపు చెన్నైకే పరిమితమైన ఏవీఎం స్టూడియోస్ వైజాగ్ లో స్టూడియోను నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.